Advertisement
Google Ads BL

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ ముచ్చట్లు నిజమేనా?


ఎన్టీఆర్ RRR మూవీ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమాని అధికారికంగా ప్రకటించాడు. హరిక హాసిని వారు, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తుంటే.. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ స్ర్కిప్ట్‌ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. అయితే త్రివిక్రమ్ సినిమా తరవాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడట, ఆయన 31వ సినిమా డైరెక్టర్‌పై రకరకాల పేర్లు వినిపించాయి. అయితే ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఎన్టీఆర్ 31 వ సినిమాపై క్లారిటీ వస్తుంది అనుకున్నారు. ఎన్టీఆర్ 31వ సినిమాని కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తోనే ఫిక్స్ అంటూ ఓ న్యూస్ ఫిల్మ్‌నగర్ లో చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తారని.. భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ మూవీని నిర్మిస్తారని, పాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ 31వ సినిమా ఉండబోతుంది అని, ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ పారితోషకం కూడా ఫిక్స్ అయ్యింది అని.. దాదాపుగా ప్రశాంత్ నీల్ పారితోషకం 17 కోట్లని, ఇప్పటికే రెండు కోట్ల అడ్వాన్స్ లు వెళ్లాయని న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని RRR తర్వాత త్రివిక్రమ్ మూవీ తర్వాత అంటే 2021 చివరిలో ఉండబోతుంది అని అంటున్నారు. ఇక ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ చూసాక అందరూ ఇప్పుడు ఎన్టీఆర్‌కి ఎంతివ్వబోతున్నారో అంటూ హాట్ హాట్ చర్చలకు తెర‌లేపారు.

Prashanth Neel and Jr NTR Movie Update :

Prashanth Neel and Jr NTR Movie Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs