Advertisement
Google Ads BL

కొత్త దర్శకుడితో నాని సినిమా...


నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో జొరు మీదున్నాడు. మొన్న వచ్చిన గ్యాంగ్ లీడర్ యావరేజ్ గా అనిపించినా వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ వెళ్తున్నాడు. కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తున్న నాని కోసం చాలామంది ఆస్పైరింగ్ డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. తమ దగ్గరున్న కథలని నానికి నచ్చే విధంగా తీర్చిదిద్దుతూ అవకాశాలని పట్టేస్తున్నారు. నిన్ను కోరి సినిమాతో శివ నిర్వాణని పరిచయం చేసిన నాని, మరో కొత్త దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల అనే కొత్త కుర్రాడు నానికి కథ వినిపించాడట. శ్రీకాంత్ చెప్పిన కథకి అబ్బురపడిన నాని, వెంటనే ఓకే అన్నాడని సమాచారం. చేతిలో మూడు సినిమాలున్నా కూడా అతడు చెప్పిన కథని అంత త్వరగా ఒప్పేసుకున్నాడంటే శ్రీకాంత్ ఓదెల నెరేషన్ నానీకి బాగా నచ్చినట్టు అర్థం అవుతుంది.

నానీకి కథల పట్ల మంచి జడ్జ్ మెంట్ ఉందని అందరికీ తెలుసు. మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ లో ఉన్న నానికి సక్సెస్ రేటు చాలా ఎక్కువ. అయితే ఈ సినిమాని ఎస్ ఎల్ వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఇప్పటి వరకూ నాని అవకాశం ఇచ్చిన వారందరూ మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. మరి శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా తనని తాను నిరూపించుకుని, నాని నమ్మకాన్ని నిలబెడతాడా లేదా చూడాలి.

Nani gives a chance to New director..:

Nani Gives a chance to New director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs