Advertisement
Google Ads BL

‘A’ మోషన్ పోస్టర్ వదిలిన జగ్గూ భాయ్


సరిక్రొత్త థ్రిల్లర్ “A”(AD  INFINITUM) చిత్రం మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన జగపతిబాబు

Advertisement
CJ Advs

యుగంధర్ ముని దర్శకత్వం వహించిన “A”(AD  INFINITUM) ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్‌ను సంచలన నటుడు జగపతిబాబు విడుదల చేశారు. మొదటి నుంచి ఈ చిత్ర బృందం విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని పెంచుతూ వచ్చాయి, ఇప్పుడు విడుదల చేసిన మోషన్ పోస్టర్ కూడా ప్రేక్షకులలో అంచనాలను మరింత పెంచేలా వుంది. తన తొలి చిత్రంలోనే నితిన్ ప్రసన్న 3 విభిన్నమైన పాత్రలు పోషించే సవాలును స్వీకరించారు, మరియు మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్ లలో పక్కింటి అమ్మాయిగా కనిపించిన హీరోయిన్ ప్రీతి అశ్రాని పూర్తిగా భిన్నమైన పాత్రను పోషిస్తుంది.

త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. ఖచ్చితంగా రాబోయే టీజర్ కూడా ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని చిత్రయూనిట్ తెలుపుతుంది. యుగంధర్ ముని మేకింగ్ స్టైల్ చూస్తుంటే నిజంగానే అతను లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకి ఏకలవ్య శిష్యుడులా వున్నాడు. ఫిల్మ్ స్కూల్ నేపథ్యం నుండి వచ్చిన దర్శకుడు తన జట్టును కూడా అదే తరహాలో ఎన్నుకున్నాడు. కెమెరామెన్ ప్రవీణ్ కె బంగారి(ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డు విన్నర్) మరియు ఆనంద్ పవన్ మరియు మణికందన్ ఎడిటింగ్ (ఎఫ్‌టిఐఐ). చిత్రంలోని అన్ని పాటలను అనంత శ్రీరామ్ రచించగా.. దీపు మరియూ పావని ఆలపించారు. దీనికి సంగీతం విజయ్ కూరాకుల. 

Click Here for Motion Poster

A Motion Poster Released by Jagapathi Babu:

A (AD Infinitum) Movie Motion poster released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs