Advertisement
Google Ads BL

మీడియాపై వరలక్ష్మీ వెటకారపు మాటలు!


తమిళనాట విశాల్‌తో లవ్ అఫైర్ నడిపి తర్వాత సినిమాల్తో బాగా పాపులర్ అయ్యి.... ప్రస్తుతం లేడి విలన్ గా అవకాశాలతో దూసుకుపోతున్న వరలక్ష్మి శరత్ కుమార్‌కి పెళ్లి అంటూ ఓ న్యూస్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె మాజీ లవర్ విశాల్, అనీషాతో పెళ్లి పీటలెక్కడానికి ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటి నుండి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా పెళ్ళికి సిద్దమయ్యింది, పెళ్లయ్యాక నటనకు స్వస్తి చెప్పబోతోంది అంటూ సోషల్ ఇండియాలో ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ నా పెళ్లి గురించి అందరికి తెలిశాక చివరకి నాకు తెలిసింది.. హాహాహా అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ నవ్వేస్తుంది. ఇవన్నీ చెత్త వదంతులు. నా పెళ్లి జరగాలని అందరూ అంతగా ఎందుకు కోరుకుంటున్నారో కానీ.. నేనిప్పుడే పెళ్లి చేసుకోను, అలాగే నటనకు స్వస్తి చెప్పను. నేను ఇంకా సినిమాల్లో నటించాలనే అనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు నేనే ఇంటి పైకప్పు ఎక్కి గట్టిగా నేను పెళ్లి చేసుకుంటున్నా అని అరుస్తాను.. అప్పుడు మీడియా వారు రాసుకుందురు కానీ..అంటూ కాస్త వెటకారంగానే తన పెళ్లిపై స్పందించింది.

Varalakshmi Sarath Kumar Satirical comments on Media:

Satirical Reaction from Varalakshmi Sarath Kumar on Marriage Rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs