జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పేర్కొంటూ జనసేన నేత, సినీ నటుడు నాగబాబు ట్వీట్ చేసి హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. గాడ్సే పుట్టిన రోజు కావడంతో నాగబాబు వరుస ట్వీట్స్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు, ఇతర పార్టీ నేతలు, సినీ ప్రియులే కాదు.. సొంత పార్టీకి చెందిన జనసేన కార్యకర్తలు, ఆఖరికి మెగాభిమానులు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు. అయితే మెగా బ్రదర్ వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఓ చానెల్ డిబెట్‌లో మాట్లాడిన ఆయన.. అవును నాగబాబు చేసిన వ్యాఖ్యలను నేను సమర్థిస్తున్నాను. నూటికి నూరు శాతమే నిజమే’ అని చెప్పుకొచ్చాడు.
సంచలన ప్రకటన..
అంతటితో ఆగని ఆయన సుధీర్ఘ వివరణ కూడా ఇచ్చుకున్నాడు. గాడ్సే కోరుకున్నవి రెండూ నెరవేరినా గాంధీని ఎందుకు చంపాడనేది ఎవరికీ తెలియదని. తన (గాడ్సే) జీవితంలో ఎప్పుడూ తుపాకి పట్టని ఆయన.. గాంధీని చంపడానికి పట్టుకున్నాడని వ్యాఖ్యానించాడు. అంతేకదాు.. గాడ్సేపై ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని.. త్వరలోనే గాడ్సేపై ఓ సినిమా చేస్తానని ఆర్జీవీ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై పలువురు మెగాభిమానులు, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
మన్మించండి మహత్మా!
మరోవైపు విజయశాంతి కూడా నాగబాబు ట్వీట్స్‌పై పరోక్షంగా సీనియర్ నటి, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే.. 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే. ఈశ్వర్, అల్లా... తేరానామ్... సబ్ కో సన్మతి దే భగవాన్. నాకు కూడా.. ‘అని’ గాడ్సే ఇప్పుడు బ్రతికుంటే.. ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు.. మన్నించండి మహత్మా’ అని మెగా బ్రదర్ ట్వీట్‌పై రాములమ్మ ట్వీట్ చేశారు.