Advertisement
Google Ads BL

మరో రికార్డ్ సాధించిన చిరు, చెర్రీ!


అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో రికార్డు సృష్టించారు. అంతేకాదు ఇద్దరికీ పోటాపోటీగా ఫాలోవర్స్ ఉన్నారు. వాస్తవానికి సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. సెలబ్రిటీలు తమ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు వాడుతూ.. ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. టెక్నాలజీ వినియోగం పెరిగినప్పటికీ సోషల్ మీడియా దూరంగా ఉన్న మెగాస్టార్ ఉగాదిని పురస్కరించిన అడుగుపెట్టారు. ఆయనలా అడుగుపెట్టిందో ఆలస్యం.. మెగాభిమానులు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున ఫాలో అయ్యారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలో అతి తక్కువ సమయంలో ఏ హీరోకు రాని ఫాలోయింగ్ వచ్చేసింది. సోషల్ మీడియాలో అడుగుపెట్టినప్పట్నుంచి ఇప్పటి వరకూ ఎన్నో అప్డేట్స్ ఇచ్చి అభిమానులను చిరు అలరిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక చెర్రీ విషయానికొస్తే.. ఇంతవరకూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే అడుగుపెట్టిన ఆయన ట్విట్టర్ జోలికి మాత్రం అస్సలు పోలేదు. అయితే ఎప్పుడైతే చిరు అడుగుపెట్టారో.. అప్పుడే చెర్రీ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. కాస్త అటు ఇటు ఇద్దరూ అడుగుపెట్టినా ఫాలోవర్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నారు. చిరును ఫాలో అయ్యేవారి సంఖ్య 5 లక్షలు దాటగా.. చెర్రీని ఫాలో అయ్యేవారు కూడా 5 లక్షల మంది ఉన్నారు. ఇద్దరూ ఇలా ఒకే టైమ్‌లో ఇలాంటి ఫీట్ అందుకోవడాన్ని మెగాభిమానులు విశేషంగా భావించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో.. చిరు, చెర్రీ ఇద్దరూ రికార్డ్ సాధించారని అభిమానులు చెప్పుకుంటున్నారు.

Chiru and Ramcharan Records Break!:

Chiru and Ramcharan Records Break!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs