Advertisement
Google Ads BL

రెండో విడత సినీ జర్నలిస్ట్స్‌కు FCA ఆర్థిక సాయం


రెండో విడతగా 89 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఒక్కొక్కరికి మూడు వేలు చేయూత‌ మొత్తం రూ. 2,67,000 సాయం.

Advertisement
CJ Advs

కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్ డౌన్ విధించ‌డంతో సినిమా రంగానికి చెందిన సినీ పాత్రికేయులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌లేదు. ప్ర‌తీరోజు ప్రెస్ మీట్స్ లో బిజీగా ఉండే సినీ పాత్రికేయులు కూడా లాక్ డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వారికి ఆస‌రాగా నిల‌వ‌ల‌న్న‌ ఉద్దేశ్యంతో స‌భ్యులంద‌రికీ అసోసియేష‌న్ ద్వారా దాదాపు మెంబ‌ర్లు అంద‌రికీ పోన్లు చేసి ఎలాంటి తార‌త‌మ్యం లేకుండా, వ‌ద్దన్న వారిని వ‌దిలేసి కమిటీ సభ్యుల సహకారంతో గత నెల ఏప్రిల్ 13వ తేదీన 87 మంది మెంబర్స్‌కి ఐదువేల రూపాయ‌లు చొప్పున వారి అకౌంట్ లోకి నెప్టీ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన సిసిసి ద్వారా నిత్యావసర సరుకులు కూడా సినిమా జర్నలిస్టులకు అందించ‌డం జ‌రిగింది. ఇప్పుడు లాక్‌డౌన్‌ మే నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు మళ్లీ ఈసారి మూడు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని కమిటీ సభ్యులు తీర్మానించుకుని వద్దన్న వారిని వదిలేసి 89 మంది సభ్యులకు మంగళవారం రోజు వారి అకౌంట్‌కు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున నేఫ్ట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది.

ఈ సంద‌ర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘‘క‌మిటీ స‌భ్యులంద‌రి స‌హాయ స‌హకారాల‌తో రెండో విడతగా మంగళవారం నాడు వద్దన్న వారికి వదిలేసి 89 మంది మెంబ‌ర్స్‌కి ఒక్కొక్క‌రికి మూడు వేల రూపాయ‌లు చొప్పున పంపించాం. సినిమా ఇండ‌స్ర్టీలోని 24 క్రాప్ట్స్ కి ఎప్పుడూ ముందుండి వారి గురించి ప్ర‌జ‌ల‌కు చేర‌వేసేది మా సినీ పాత్రికేయ కుటుంబ‌మేన‌ని చెబుతూ. మీరు సినీ కార్మికుల సంక్షేమం కోసం చేసే మంచి ప‌నుల విష‌యంలో సినీ పాత్రికేయుల‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జ‌నార్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘స‌మిష్టిగా అంద‌రూ క‌లిసి ప‌నిచేస్తున్నాం. క‌మిటీ స‌భ్యులంద‌రి స‌హ‌కారంతో ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి విప‌త్తు ఎప్పుడూ రాకూడ‌ద‌ని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. 

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులైన 89 మందికి ట్రాన్స్‌ఫర్ చేయమని రెండు చెక్కుల రూపంలో రెండు లక్షల 67 వేల రూపాయల చెక్కులను ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ టి సీతారాములుకి ప్రెసిడెంట్ సురేష్ కొండేటి, జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, ట్రెజరర్ భూషణ్, కమిటీ సభ్యులు సాయి రమేష్, గౌరవ సలహాదారు లక్ష్మణరావు అందించారు.

Again Film Critics Association Helps Cine Journalists:

FCA Money Help to Cine Journalists
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs