Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ప్లానింగ్ మాములుగా లేదు


ఎన్టీఆర్ పేరు RRR సినిమా విషయంలో ఎంతగా హైలెట్ అయ్యిందో తెలియదు కానీ.. రేపు 20 న రాబోయే ఎన్టీఆర్ పుట్టినరోజునాడు ఎన్టీఆర్ కోసం దర్శకనిర్మాతలుఈ ఎలాంటి స్పెషల్స్ తయారు చేసారో అనే విషయం పై ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో గత పది రోజులుగా హంగామా మొదలెట్టారు. ఎన్టీఆర్ బర్త్ డే హాష్ టాగ్ తో సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ అయ్యింది. అయితే RRR నుండి ఎన్టీఆర్ స్పెషల్ వీడియో రావడం లేదంటూ ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రకటించేసింది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ వరసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

Advertisement
CJ Advs

RRR తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ మూవీని లైన్ లో పెట్టాడు. అయితే త్రివిక్రమ్ మూవీ లో ఓ పొలిటికల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని సంప్రదిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే త్రివిక్రమ్‌ని సంజయ్ తో విలన్ గా చేయించమని ఎన్టీఆర్ కోరాడని.. ఇంతకుముందే అంటే కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మీటింగ్ జరిగింది అని.. కెజిఎఫ్ 2 మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ని, కెజిఎఫ్ స్టార్ హీరో యష్ ని పిలిచి డిన్నర్ పార్టీ ఇచ్చాడని.. అందులో సంజయ్ దత్ కూడా ఉన్నాడని, సంజయ్ దత్ తో అప్పుడే త్రివిక్రమ్ సినిమాలో విలన్ రోల్ చేయించాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడని అంటున్నారు.

ఇంతకుముందే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ కి మధ్యన కథ చర్చలు జరిగాయని, అలాగే సంజయ్ దత్ తో కలిసి సినిమా చేస్తే బాలీవుడ్ లోను క్రేజ్ పెరుగుతుందని, ఎలాగూ RRR తో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ కి తన తదుపరి చిత్రాలు కూడా అలానే పాన్ ఇండియా క్రేజ్ రావాలని అనుకుని.. ఇలా త్రివిక్రమ్ ని ఎన్టీఆర్ ఒప్పించాడనే టాక్ నడుస్తుంది. అయితే ఇంత ప్లాన్ ఎన్టీఆర్ చేసాడంటారా? అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

Young Tiger Jr NTR Superb Planning Revealed:

Sanjay Dutt in jr ntr and Trivikram Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs