Advertisement
Google Ads BL

విరాట్ కోహ్లీ బయోపిక్.. హీరో ఎవరో తెలుసా..?


ఈ మధ్య కాలంలో బయోపిక్ ల హవా బాగా నడుస్తోంది. రాజకీయ, వ్యాపార, క్రీడారంగానికి చెందిన ప్రముఖుల జీవితాలని వెండితెర మీద చూపించడానికి దర్శకులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా క్రికెటర్ల జీవితాలని తెరపై ఆవిష్కరించడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. భారత క్రెకెట్ మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనీ జీవితంపై వచ్చిన బయోపిక్ కి కాసుల వర్షం కురిపించింది.

Advertisement
CJ Advs

రణ్ వీర్ సింగ్ హీరోగా 1983లో క్రికెట్ ప్రపంచకప్ అందుకున్నప్పటి కథని తీసుకుని 83 అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో కనిపించనున్నాడు. కపిల్ దేవ్ భార్య పాత్రలో రణ్ వీర్ సింగ్ భార్య దీపిక పదుకునే నటిస్తుంది. అయితే తాజాగా మరో బయోపిక్ గురించిన చర్చ బయటకి వచ్చింది. లాక్డౌన్ కారణంగా సెలెబ్రిటీలందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి టచ్ లో ఉంటూ, వారడిగే ప్రశ్నలకి సమాధానాలు చెబుతున్నారు.

ప్రస్తుత భారట క్రికెట్ టీమ్ కెప్టెన్ కోహ్లీ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని మీ బయోపిక్ లో ఏ హీరో నటిస్తే బాగుంటుందని అడగ్గా, దానికి సమాధానంగా, నా బయోపిక్ లో నేను నటిస్తేనే బాగుంటుంది, నా భార్య అనుష్క నా పక్కన నటిస్తానంటే నేను రెడీ అని చెప్పుకొచ్చాడు.  బాలీవుడ్ మేకర్స్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారేమో చూడాలి.

Virat Kohli biopic.. Do you who is the hero..?:

Virat Kohli biopic.. he is the hero.. Will bollywood think about it..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs