Advertisement
Google Ads BL

నేటికాలంలో ఫైట్ అక్కర్లేదు.. ట్వీట్ చాలు.. హరీష్ శంకర్..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజై 8సంవత్సరాలు అయినందున అభిమానులు ఆ రోజుని ఒక ఉత్సవంలా నిర్వహించారు. ట్విట్టర్ ని షేక్ చేస్తూ ఉర్రూతలూగించారు. అయితే ఆరోజు నుండి నిర్మాత బండ్లగణేష్, డైరెక్టర్ హరీష్ శంకర్ ల మధ్య చిన్నపాటి వార్ స్టార్ట్ అయింది. అప్పటి నుండి వీరిద్దరి మధ్య సోషల్ మీడియా సాక్షిగా వార్ జరుగుతూనే ఉంది. గబ్బర్ సింగ్ సినిమాకి పనిచేసిన టెక్నిషియన్స్ అందరికీ థ్యాంక్స్ తెలియజేసిన హరీష్, నిర్మాత బండ్లగణేష్ ని మర్చిపోయాడు.

Advertisement
CJ Advs

అప్పటి నుండి బండ్లగణేష్ హరీష్ పై విమర్శనాస్త్రాలు వదులుతూనే ఉన్నాడు. అయితే తాజాగా బండ్లగణేష్, హరీష్ తో మళ్ళీ సినిమా చేయనని చెప్పేశాడు. ఈ విషయమై హరీష్ ఇంకా స్పందించకముందే టాలీవుడ్ ప్రొడ్యూసర్ పీవీపీ మధ్యలోకి వచ్చాడు. ఎవరో నీతో సినిమా చేయనంటే నీకేంటి.. నీకు మేమున్నాం. నీకోసం చాలా మంది నిర్మాతలు వెయిట్ చేస్తున్నారని అన్నాడు. 

సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉండే హరీష్ పీవీపీ గారికి రిప్లై ఇస్తూ, మీ భావం, మీ భాష రెండూ నను అలరించాయి. ఈ కాలంలో మనిషిని చీల్చి చెండాడడానికి ఫైటే అక్కర్లేదు. ట్వీటే చాలంటూ బండ్లకి కౌంటర్ వేశాడు. మొత్తానికి వీరిద్దరి వరస చూస్తుంటే చాలా రోజుల నుండి చిన్నపాటి కోల్డ్ వార్ జరుగుతూనే ఉన్నట్టుగా తోస్తుంది. గబ్బర్ సింగ్ ఎనిమిదవ వార్షికోత్సవం ఆ వార్ బయటపడేలా చేసిందని చెప్పుకుంటున్నారు.

Harish replied to the known producer:

Harish Shankar counter to Bandla ganesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs