Advertisement
Google Ads BL

థియేటర్ కార్మికులు నిరసనకు దిగారు


తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్స్ లో పనిచేసే కార్మికులకు లాక్ డౌన్ కాలంలో పూర్తి వేతనాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సి ఐ టి యు) ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. ఈ దీక్షను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి వెంకటేష్, పాలడుగు భాస్కర్ ప్రారంభిస్తూ కరోనా వైరస్ మూలంగా గత రెండు నెలలుగా లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం, పనిచేసే కార్మికులందరికీ లాక్ డౌన్ కాలానికి పూర్తి జీతం ఇవ్వాలని జీవో నెంబర్ 45 తీసుకు రావడం జరిగింది కానీ సినిమా థియేటర్ యజమానులు థియేటర్ లో పనిచేసే కార్మికులకు మార్చి, ఏప్రిల్ నెల జీతాలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన జీవోను లెక్కచేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నా యజమానులపై కఠిన చర్యలు తీసుకొని కార్మికులకు సకాలంలో జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. 

Advertisement
CJ Advs

అదేవిధంగా రాష్ట్రంలోని కొన్ని థియేటర్స్ లో లాక్ డోన్ పేరుతో కార్మికులను పనిలో నుంచి తొలగిస్తున్నారు మరియు కార్మికులకు ఇచ్చే  వేతనంలో 40 - 50 శాతం వేతనాల్లో కోతలు విధిస్తున్నారు. లాక్ డౌన్ తో రాష్ట్రంలో సినిమా థియేటర్ లో పనిచేసే 20000 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్స్ పనిచేసే కార్మికులకు నిత్యవసర సరుకులు అలాగే 7500 రూపాయలు అందించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ నిరసన దీక్షా కార్యక్రమంలో తెలంగాణ సినిమా ధియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం మారన్న రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి పుల్లారావు కె అరుణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్రెడ్డి, శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కే సత్తయ్య, నాయకులు సుధాకర్, సురేష్ ఐనాక్స్ రాజు, కోటేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.

Movie Theater employees deeksha at Telangana:

cinema Theaters employees deeksha at Telangana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs