Advertisement
Google Ads BL

మెగా ఫ్యామిలీ నుంచి మరో ఓటీటీ మాధ్యమం!


మెగాస్టార్ చిరంజీవి వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే సిరీస్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం విదితమే. ‘ఆచార్య’ తర్వాత సిరీస్‌లో నటిస్తానని పెద్ద కుమార్తె సుస్మితకు మాటిచ్చారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో అందరూ ఉండటంతో ఇటీవల ఈ టాపిక్‌ వచ్చిందట. ఈ సిరిస్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు దాదాపు అందరూ ఉంటారట. 

Advertisement
CJ Advs

వాస్తవానికి.. ఇప్పుడు అంద‌రి చూపు ఓటీటీ బిజినెస్‌ల వైపే మళ్లింది. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్‌ నిర్మాతలు, దర్శకులు అటువైపు అడుగులేయగా.. మరికొందరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. చిరు డాటర్ సుస్మిత కూడా ఓటీటీ బిజినెస్ వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలియవచ్చింది. కోట్లు ఖ‌ర్చు పెట్టి సినిమాలు, సీరియ‌ల్స్ తీయ‌డం కంటే వెబ్ సిరీస్‌లు లేదా ఓటీటీ బిజినెస్ బెట‌ర్ అని ఆమె భావిస్తోందట. కరోనా కష్టకాలం తర్వాత ఓటీటీ మాధ్యమాన్ని ప్రారంభించాల‌ని అనుకుంటోందట. 

అంటే.. ‘నెట్ ఫ్లిక్స్’, ‘ఆహా’, ‘అమెజాన్‌’లాగా కొత్త మాధ్యమాన్ని ప్రారంభించాలనే యోచన అన్న మాట. ఇందులో మెగా హీరోలను కూడా వెబ్ సిరీస్‌లను రిలీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చిందట. వాస్తవానికి ఈ ఆలోచన మంచిదే. మంచిగా మార్కెటింగ్ చేసుకుంటే గ్రాండ్ సక్సెస్ అవ్వొచ్చు. మెగా ఫ్యాన్స్ ఈ మాధ్యమాన్ని ఈజీగా సక్సెస్ చేసేస్తారు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కాగా.. సుస్మిత కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్న విషయం విదితమే. మరి.. సుస్మిత అనుకున్నది ఆచరణలోకి ఎప్పుడు వస్తుందో..? ఇది ఎంతవర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

One More Digital Platform From Mega Family!:

One More Digital Platform From Mega Family!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs