హీరోయిన్ త్రిష కెరీర్ ముగిసిపోయింది. ఇక ఫైనల్ గా పెళ్లి అనుకున్నప్పుడు త్రిష మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యింది. సినిమాలతో బిజీగా ఉన్న టైంలోనే చెన్నైకి సంబంధించిన వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం జరిగింది. అయితే మధ్యలో ఏమైందో తెలియదు కానీ.. త్రిష పెళ్లి పేరెత్తకుండా మళ్ళీ సినిమాలు అంటూ సినిమాలతోనే కాలం గడిపేస్తుంది. అయితే త్రిషకి 37 ఏళ్ళు వచ్చేయడంతో త్రిష పెళ్ళెప్పుడు అంటూ అందరూ అడుగుతున్నారు.
కానీ త్రిష మాత్రం నో ఆన్సర్. తాజాగా త్రిష ఆచార్య సినిమా నుండి వాకౌట్ చేసి సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. గత నెల రోజులుగా త్రిష న్యూస్ లోనే ఉంది. ఇక కరోనా లాక్ డౌన్ తో త్రిష ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తుంది. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటే.. త్రిషను ఓ అభిమాని మీ జీవిత భాగస్వామి దొరికారా? అని అడగడంతో... దీనికి సమాధానంగా... ‘ఇంకా అతన్ని కలవలేదు’ అని త్రిష చెప్పింది. మరి ఈ ఆన్సర్ తో త్రిషకి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. అసలు కెరీర్ ఇంకా దూసుకుపోతుంటే పెళ్లి గురించి ఆలోచన ఎందుకొస్తుందిలే అంటున్నారు.