Advertisement
Google Ads BL

ఎట్టకేలకు కోనవెంకట్ చెప్పేశాడు...


భాగమతి వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్దం ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. ఒకప్పటి హీరో మాధవన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. పూర్తిగా అమెరికాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిమ్ కార్పోరేషన్ బ్యానర్ పై కోనవెంకట్ నిర్మాతగా తెరకెక్కించారు. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Advertisement
CJ Advs

కరోనా లాక్డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో ఓటీటీ నుండీ నిశ్శబ్దం చిత్ర నిర్మాతకి భారీ ఆఫర్ వచ్చిందని, మరికొద్దిరోజుల్లో అమెజాన్ ప్రైమ్ లో రానుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై చిత్ర దర్శకుడు కూడా వయా మీడియా పాలసీని అనుసరించడంతో నిశ్శబ్దానికి ఇక ఓటీటీనే ఏకైక ఛాయిస్ అనుకున్నారు.

కానీ ఈ చిత్రాన్ని డైరెక్టుగా థియేటర్లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు కోనవెంకట్ తెలిపాడు. కోన వెంకట్ ట్వీట్ చేస్తూ, మేమంతా సినిమా ఇండస్ట్రీకి ఎంతో ఇష్టపడి వచ్చాం. ఎంతో కష్టపడి ఇక్కడ నిలదొక్కుకున్నాం . సినిమాలు రూపొందించేది థియేటర్లలో చూడడానికే. అక్కడ రిలీజ్ చేస్తేనే మాకు ఆనందం కలుగుతుంది. అదే మాకు అతిపెద్ద ఆక్సిజన్ లా పనిచేస్తుంది. సినిమా అంటే థియేటరే అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ దెబ్బతో నిశ్శబ్దం ఓటీటీలో వస్తుందన్న వార్తలకి ఫుల్ స్టాప్ పడనుంది.

Kona Venkat revealed about Nissabdam release:

Konavenkat revealed about Nissabda release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs