జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన పొన్ మగల్ వంధాల్ అనే చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న మొదటి తమిళ చిత్రం ఇది. థియేటర్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో ఇక చేసేదేమీ లేక ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాత సూర్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది. ఈ నెల ౨౯వ తేదీ నుండి ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవనుంది.
అయితే సూర్య నిర్ణయంపై తమిళ థియేటర్ యాజమాన్యాలు కోపంగా ఉన్నాయి. భవిష్యత్తులో సూర్య సినిమాలని థియేటర్ లో విడుదల కాకుండా చూసుకుంటామని హెచ్చరించాయి కూడా. అయితే ఇలాంటి బెదిరింపులకి సూర్య భయపడట్లేదట. నా సినిమా నా ఇష్టం అంటున్నాడు. నేను థియేటర్లో రిలీజ్ చేయాలనే సినిమా తీశాను. కానీ ఏం చేస్తాం. పరిస్థితులు అనుకూలించలేదు.
నాకు చాలా అప్పు ఉంది. అది తీర్చడానికి ఎవరూ ముందుకు రారు కదా.. సినిమాలు ఫ్లాప్ అయినపుడు ఎవరూ హెల్ప్ చేయరు. అలాగే హిట్ అయినపుడు లాభాలు వచ్చాయని తెలిసినా కూడా మాకు రావాల్సింది ఇవ్వరు. మరి వారి కోసం నేనేందుకు నా సినిమాని ఆపుకోవాలి. అయినా నా సినిమా నా ఇష్టం. నా బిజినెస్ నా ఇష్టం..అంటున్నాడు.