Advertisement
Google Ads BL

క్వారంటైన్‌లో ఆ హీరోతో కలిసుంటా: పూజా హెగ్డే


ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌లో హీరోయిన్స్ అంతా ఏవేవో చేస్తూ సోషల్ మీడియాలో బిజీగా గడుపుతున్నారు. వర్కౌట్స్, వంటలు, తల్లితండ్రులతో కాలం గడపడం ఇలా ఎవరికీ నచ్చినట్టుగా వారు ఉంటున్నారు. అయితే హీరోయిన్స్ చాలామంది సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అయితే హీరోయిన్ పూజా హెగ్డే‌ని మీరు క్వారంటైన్ టైం లో ఉన్నప్పుడు మీకిష్టమైన ఏ హీరోతో మీరు క్వారంటైన్ షేర్ చేసుకుంటారు అని అడగగా.. దానికి పూజా ఇది చాలా కష్టమైనా ప్రశ్నే. ఒకరని కాదు కానీ.. అందరు హీరోలతోనూ అనిపిస్తుంది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్‌లలో ఎవరికీ వారే అనేక అంశాల్లో ప్రతిభావంతులు. అందుకే నాకు ఇలా క్వారంటైన్ అవకాశం వస్తే... అందరి దగ్గరనుండి ఏదో ఒక విద్య నేర్చుకోవాలని ఉంది అంటుంది.

Advertisement
CJ Advs

అదే ఒకే ఒక్క హీరోని ఎంచుకోవాలని చెబితే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ని ఎంచుకుంటా అని.. స్వీయ నిర్బంధంలో హృతిక్ రోషన్‌తో కలిసుంటా అని పూజా తెలిపింది. ‘‘హృతిక్ రోషన్ చిన్నప్పటినుండి నా కలల హీరో. నా అదృష్టం కొలది బాలీవుడ్‌లో నా ఫస్ట్ సినిమాని ఆయనతోనే కలిసి నటించా. హృతిక్ అనేక విషయాల్లో నాకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. స్వీయ నిర్బంధంలో రోజూ లేచిన తర్వాత హృతిక్ అందాన్ని చూస్తూ గడిపేస్తా. వర్కౌట్స్ చెయ్యడం, అటు ఆహారపు అలవాట్లలో, ఇటు డ్యాన్స్‌ల విషయాలలో హృతిక్ నుండి ఎంతో నేర్చుకుంటా..’’ అని పూజా చెబుతుంది. 

Pooja hegde wants Hrithik roshan:

I spent with hrithik roshan In quarantine days says pooja hegde
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs