Advertisement
Google Ads BL

రష్మిక కలలపై కాటేసిన కరోనా..


ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు. పూజా హెగ్డే తర్వాత రష్మికకే అంతటి స్టార్ డమ్ ఉందని చెప్పగలం. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో పాటు భీష్మ సినిమా కూడా విజయవంతం కావడంతో ఆమెకి తిరుగులేకుండా పోయింది. ప్రస్తుతం రష్మికకి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. దాంతో ఆమె రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.

Advertisement
CJ Advs

అయితే పారితోషికం విషయంలో ఆమెకి ఓ టార్గెట్ ఉండిందట. ఈ ఏడాది రెండుకోట్ల రూపాయల పారితోషికం తీసుకోవాలని భావించిందట. అందుకు తగ్గట్టుగానే ఆమె చేతిలో మంచి మంచి సినిమాలు ఉన్నాయి. బన్నీ- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తుంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదే ఆమె టార్గెట్ రీచ్ అయ్యుండేదట.

కానీ కరోనా వల్ల థియేటర్లు మూతబడిపోయి ఇండస్ట్రీ ఆర్థికంగా నష్టపోవడంతో ఆమె కలలకి కత్తెర పడింది. ఈ కష్టకాలంలో ఆమె టార్గెట్ రీచ్ అవ్వడం చాలా కష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మించడానికి గతంలోలా కోట్లకి కోట్లు రెమ్యునరేషన్లు ఇచ్చుకోలేరు.. సో రష్మిక కల కలగానే మిగిలిపోనుంది.

Rashmika Mandanna Dream failed due to corona..:

Rashmika Mandanna Dream failed due to corona
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs