ఆర్ ఎక్స్ భామ పాయల్ రాజ్ పుత్ క్వారంటైన్ టైమ్ లో షార్ట్ ఫిలిమ్ తో మనముందుకు వచ్చింది. కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో ఎంతో మంది ముగుళ్ళు తమ భార్యల్ని గృహహింసకి గురిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. లాక్డౌన్ లో వారి పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేక లాక్ వేసినట్టయింది. అయితే ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా ఆ మహిళలకి మద్దతుగా నిలవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు.
అయితే ఆ గృహహింస కాన్సెప్ట్ తోనే పాయల్ రాజ్ పుత్ లఘుచిత్రం బయటకి వచ్చింది. కేవలం 24గంటల్లో తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిలిమ్ లో భర్త చేసే హింస వల్ల భార్య ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూపించారు. ఈ లఘుచిత్రంలో పాయల్ రాజ్ పుత్ గృహిణిగా ఉంటూనే రైటర్ గా పనిచేస్తుంది. అయితే తన భర్తవల్ల ఆమె ఏమీ రాయలేకపోతుంది. ప్రతీ సారీ ఏదో ఒక విషయమై ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది.
భర్త హింస రోజు రోజుకీ పెరిగిపోవడంతో ఒకానొక రోజు అతన్ని చంపేస్తుంది. స్థూలంగా ఇదే స్టోరీ. ఈ షార్ట్ ఫిల్మ్ ని పాయల్ స్నేహితుడు సౌరభ్ ధింగ్రా దర్శకత్వం వహించాడు. 16 నిమిషాల నిడివగల ఈ షార్ట్ ఫిలిమ్ ద్వారా పాయల్ మంచి ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు.