Advertisement
Google Ads BL

విజయ్ దేవరకొండపై మరోభామ మనసుపడింది


విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ స్టార్ హీరో. టాలీవుడ్ లో మహేష్, ఎన్టీఆర్ అంత ఫాలోయింగ్ లేకపోయినా... విజయ్ దేవరకొండ కి యూత్ ఫాన్స్ బాగా ఉన్నారు. విజయ్ దేవరకొండకి అభిమానులెంతమంది ఉన్నారో తెలియదు కానీ.. విజయ్ దేవరకొండ తో సినిమాలు చెయ్యాలంటూ విజయ్ అంటే క్రష్ అని చెప్పే హీరోయిన్స్ లిస్ట్ మాత్రం రోజురోజుకి పెరిగిపోతుంది. విజయ్ దేవరకొండ తో ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ రౌడీ హీరో స్టయిల్ తమకి ఇష్టమంటూ హీరోయిన్స్ క్యూ కడుతున్నారు. బాలీవుడ్ మొదలు టాలీవుడ్ వరకు విజయ్ దేవరకొండ అంటే క్రష్ అంటున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పటికే తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజపుత్ లాంటోళ్ళు విజయ్ అంటే క్రష్ అని.. విజయ్ తో ఓ సినిమా చెయ్యాలని ఉందని అన్నారు.

Advertisement
CJ Advs

బాలీవుడ్ లో అయితే జాన్వీ కపూర్, అలియా భట్ లు విజయ్ దేవరకొండ స్టయిల్ కి ఫిదా అంటున్నారు. అలాగే విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న అనన్య పాండే కూడా విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని.. ప్రస్తుతం విజయ్ తో వర్క్ ఎంజాయ్ చేస్తున్నా అంది. తాజాగా బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, టాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేస్తున్న అమైరా దస్తూర్... తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని మనసులోని మాటను బయటపెట్టింది. విజయ్ దేవరకొండ పై తనకు క్రష్ ఉందని... విజయ్ దేవరకొండ తో నటించే ఛాన్స్ వస్తే ఓ సినిమా చెయ్యాలని ఉందని చెప్పడమే కాదు.... అది బాలీవుడ్ మూవీ అయితే బావుంటుంది అని చెబుతుంది.

One More Heroine Crush on Vijay Deverakonda:

Amyra Dastur secret Crush Vijay Deverakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs