ప్రస్తుతం హీరోయిన్ తమన్నా వచ్చిన ఆఫర్స్‌తో సరిపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే స్టార్ హీరోలెవరు తమన్నాని పిలిచి సినిమా ఇవ్వరు. ఎందుకంటే తమన్నా క్రేజీ లిస్ట్ నుండి ప్రస్తుతం బయటి కొచ్చేసింది. అయితే తాజాగా కాస్త మీడియం, సీనియర్ హీరోలకి కనెక్ట్ అవుతున్న తమన్నా, ఇప్పుడు ఓ సీనియర్ హీరో సినిమా నుండి తప్పుకుంది అని.. అది కూడా పారితోషకం విషయంలో తేడాలొచ్చి తప్పుకుంది అనే టాక్ నడుస్తుంది. అసలు అవకాశాలు తగ్గినప్పుడు పారితోషకం విషయంలో అలా ఉంటే.. ఉన్నవి కూడా పోతాయని తెలిసినా అలా చెయ్యడం తమన్నాకే తెలియాలి అంటున్నారు.
ప్రస్తుతం గోపీచంద్ సినిమా సీటిమార్‌లో కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తున్న తమన్నాకి రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన కాంబోలో రాబోతున్న సినిమాలో ఛాన్స్ వచ్చిందట. కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన తమన్నా ఇప్పుడు పారితోషకం విషయంలో వచ్చిన తేడాలతో ఆ సినిమాని వదులుకుంది అనే టాక్ నడుస్తుంది. మరోపక్క పారితోషకం కాదు.. పాత్ర నచ్చకే అంటున్నారు. గతంలోనూ తమన్నా రాజుగారి గది 3 నుండి కొన్ని సీన్స్ షూట్ జరిగాక పాత్ర నచ్చని కారణంగా తప్పుకోవడంతో ఓంకార్ అప్పటికప్పుడు అవికా గోర్ ని తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు కూడా అంతేనా.. లేదంటే పారితోషకమే అసలైన కారణమా అనేది తెలియాల్సి ఉంది.