Advertisement
Google Ads BL

హిజ్రాలను ఆదుకుంటున్న శేఖర్ కమ్ముల


ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న పలువురికి తనవంతుగా సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయన జి.హెచ్.ఎం.సి, కర్నూలు పారిశ్యుధ్ద కార్మికులకు నెలరోజుల పాటు బాదం పాలు, మజ్జిగ అందచేస్తున్నారు. ఇప్పుడు హిజ్రాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు. అంతేగాకుండా వీళ్లకు సాయం చేయడానికి మరికొంత మంది ముందుకు రావాలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement
CJ Advs

‘‘ఈ లాక్డౌన్ time లో అత్యంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు Transgenders. వాళ్ళు పడుతున్న కష్టాలని ఊహించలేం కూడా. అన్నం లేక, ఉంటానికి ప్లేస్ దొరక్క, అద్దెలు కట్టుకోలేక చాలా బాధలు పడుతున్నారు. ఇవి కాక సమాజంలో వాళ్ళ పట్ల ఉండే వివక్ష, అపోహలు వాళ్ళ ఇబ్బందుల్ని ఇంకా పెంచుతున్నాయి. వాళ్ళకి అడ్రస్ ఉండదు. ఓటర్ కార్డ్ ఉండదు. రేషన్ కార్డ్ ఉండదు. Health care పథకాలు వర్తించవు. సెన్సిటివ్ గా ఉందాం. వాళ్ళని సపోర్ట్ చేద్దాం. ఎవరన్నా కాంటాక్ట్ చేయాలి అంటే rachanamudraboyina@gmail.com సంప్రదించవచ్చు..’’ అని తెలిపారు. 

శేఖర్ కమ్ముల చేసిన సాయానికి కృతజ్ఞతగా హిజ్రాలు ‘‘థాంక్యూ శేఖర్ కమ్ముల’’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. మరింత మంది తమను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు.

Director Sekhar Kammula Helps Transgenders :

<span>Director Sekhar Kammula donates Daily essentials to Transgender community</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs