కృష్ణవంశీ ఇప్పుడు అంటే కాస్త డల్ అయ్యాడు కానీ.. ఒకప్పుడు కృష్ణవంశీ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే కృష్ణవంశీకి కాస్త కోపమెక్కువ, ఆయనకి టెంపరిమెంట్ ఎక్కువ అనే ప్రచారం ఉంది. గతంలో నటుడు ఉత్తేజ్ కి కృష్ణవంశీకి మధ్యన ఏవో విభేదాలన్నారు. తాజాగా ఉత్తేజ్ ఆ విభేదాలపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా మరో నటుడు కృష్ణవంశీ కోపం ఎలాంటిదో చెప్పాడు. బిగ్ బాస్ వన్‌లో ఒక్కసారిగా ఫేమ్ లోకొచ్చిన నటుడు ఆదర్శ్ బాలకృష్ణ ఎప్పటినుండో సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా, కొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్నాడు.
ఆదర్శ్ బాలకృష్ణ.. కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే సినిమాలో కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. అయితే ఆ సినిమా చేస్తున్నప్పుడు కృష్ణవంశీ తనని రోజు తిట్టేవాడని.. నీకు నటన రాదు, నువ్వెందుకు పనికి రావు అంటూ ఒక రేంజ్ లో తిట్టేవారని, ఆమాటలకు చాలా అవమానంగా ఫీల్ అయ్యేవాడిని అని.. అంతేకాకుండా ఆయన తిట్లని చాలా సహనంగా భరించా అని, అయితే నా నుండి మంచి నటనను రాబట్టుకోవడానికే ఆయన నన్ను తిట్టేవారని సరిపెట్టుకున్నా అని.. ఇక ఆయనపై కోపం కూడా పెంచుకోలేదని, తర్వాత మేము ఫ్రెండ్స్ అయ్యామని చెబుతున్నాడు.