Advertisement
Google Ads BL

వన్ బిలియన్ వ్యూస్.. అంత ఈజీ కాదు..


అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ వెనక, ఆ సినిమాకి సంగీతం అందించిన థమన్ కృషి చాలా ఉంది. ఒక సినిమాలోని పాటలు ఈ రేంజ్ లో చార్ట్ బస్టర్స్ అవుతాయని ఎవ్వరూ ఊహించలేదు. సామజవరగమనా నుండి రాములో రాములా.. బుట్టబొమ్మ.. ఇలా ఏ పాటైనా దానికదే ప్రత్యేకం. ఇండియా లెవెల్లో ఈ పాటలు సంచలనం సృష్టించాయి.

Advertisement
CJ Advs

అందుకే యూట్యూబ్ లో వన్ బిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేశాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయిన ఈ ఆల్బమ్ కి వన్ బిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలోని ట్యూన్లకి తమ సొంత భాషలో లిరిక్స్ రాసుకుని పాడుకున్నారంటే, ఈ ఆల్బమ్ ఎక్కడివరకు రీచ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో పాటలు అనవసరం అనుకునే వాళ్లకి అల వైకుంఠపురములో సక్సెస్ ఒక చెంపదెబ్బలా అనిపించవచ్చు.

సినిమా కంటే ముందే పాటలు బ్లాక్ బస్టర్ అయితే వాటి ఇంపాక్ట్ సినిమాపై ఏ విధంగా ఉందో అలవైకుంఠపురములో సినిమాతో తెలుసుకోవచ్చు. కలెక్షన్ల పరంగా నాన్ బాహుబలి రికార్డుని క్రియేట్ చేసిన అల్లు అర్జున్, యూట్యూబ్ వ్యూస్ ద్వారా ఏ టాలీవుడ్ హీరో అందుకోలేని రికార్డుని నెలకొల్పాడు.

Ala vaikunthapurramulo Album created record in YouTube..:

Ala Vaikunthapurramulo Album got 1 billion views
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs