Advertisement
Google Ads BL

ఈ కమెడియన్ కూడా విలన్ అవుతాడంట!


సునీల్ కమెడియన్ నుండి హీరోగా మారడం.. హీరో నుండి కమెడియన్ గా మారడం అప్పుడు సక్సెస్ కాక విలన్ అవతారం కూడా ఎత్తాడు కానీ.. రీ ఎంట్రీ తో మాత్రం సునీల్ కి క్రేజ్ రావడం లేదు. ఇప్పుడు మరో కమెడియన్ కి విలనిజం పండించాలని ఉందట. పెళ్లి చూపులు సినిమాలో నేచురల్ కామెడీ తో ఆకట్టుకుని.. మల్లేశం సినిమాలో హీరోగా అదరగొట్టిన ప్రియదర్శి.. విభిన్న పాత్రలకు బాగా సెట్ అవుతున్నాడు. ప్రియదర్శి కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. తాజాగా ప్రియదర్శి అన్నపూర్ణ స్టూడియోస్ వారి లూజర్ అనే వెబ్ సీరీస్ కూడా చేసాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు.

Advertisement
CJ Advs

కామెడీ చెయ్యడం చాలా ఈజీ అని చాలామంది అనుకుంటారు. కానీ సహజంగా కామెడీ పండించడం చాలా కష్టం. అలా కామెడీ చెయ్యడంలో మంచి మార్కులు తెచ్చుకున్నా. ఇక విభిన్న పాత్రలకు సై అంటున్న నన్ను అందరూ మీరు కమెడియానా.. లేదా కేరెక్టర్ ఆర్టిస్టా అని అడుగుతున్నారు. అన్ని రకాల పాత్రల్లో నన్ను నేను బెస్ట్ అనిపించుకోవాలని తాపత్రయ పడుతున్నాను. ఇక కమెడియన్ గా పేరుతెచ్చుకున్న నేను.. కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఇక విలన్ గా కూడా చేసి పేరు తెచ్చుకోవాలని ఉంది. నటుడిగా పదిమెట్లు ఎక్కాలంటే అన్నిరకాల పాత్రలు చెయ్యాలి.. ప్రస్తుతం నేను చేసిన పాత్రలతో చాలా తృప్తిగా ఉన్నాను అని చెప్పాడు.

Priyadarshi interest on Villain Roles:

Comedian Priyadarshi Interview Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs