Advertisement
Google Ads BL

స్టార్ హీరోయిన్ కాదు.. అయినా ఐదుకోట్ల సాయం చేసింది..


కరోనా క్రైసిస్ వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన వారిలో చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. సినిమా షూటింగులు లేకపోవడంతో రోజు వారి సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. దాంతో స్టార్ హీరోల దగ్గరి నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ రోజు వారి సినీ కార్మికులకి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఇలా సాయం చేసినవారిలో హీరోయిన్లు తక్కువగా ఉండడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయం.

Advertisement
CJ Advs

అయితే హీరోయిన్ గా ఇంకా నిలదొక్కుకోకపోయినా, ఐటెం గర్ల్ గా ప్రత్యేక పాటల్లో హీరోతో స్టెప్పులేస్తూ కనిపించే హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ కాకపోయినా ఊర్వశి రౌతేలాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని వేడెక్కించే ఊర్వశి, టిక్ టాక్‌లో మాస్ట‌ర్ డ్యాన్స్ క్లాస్ పేరుతో ఓ ఆన్ లైన్ ప్రోగ్రాం మొద‌లుపెట్టింది.

ఈ డాన్స్ క్లాస్ కి 18 మిలియన్ల మంది కనెక్ట్ అయ్యారు. దాంతో అక్కడ వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వానికి విరాళం ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాయం చేయాలన్న మనసుంటే డబ్బు దానంతట అదే వస్తుందనడానికి ఊర్వశి ప్రయత్నమే నిదర్శనం. అవతలి వారికోసం ఏదైనా సాయం చేయాలనుకున్నప్పుడు ప్రతీ ఒక్కరూ ముందుకు వస్తారని అర్థం అవుతుంది.

She is not stgar heroine.. but helped to cine workers:

Urvasii Rautela announced 5 crores to Govt of India
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs