విజయ్ దేవరకొండ -పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా నలభై శాతం ముంబై పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరిగింది. ఇంకా మిగతా షూటింగ్ కూడా ముంబైతో లింకై ఉన్న స్టోరీనే కావడం.. ప్రస్తుతం ఇండియాలోని మహారాష్ట్ర ముంబై మహానగరాన్ని కరోనా మహమ్మారి కమ్మెయ్యడంతో.... అన్ని చోట్లా లాక్ డౌన్ ఎత్తేసిన మహారాష్ట్ర లో లాక్ డౌన్ ఎత్తడం అటుంచి.. ఇప్పుడప్పుడే షూటింగ్స్‌కు అనుమతినిచ్చే అవకాశం లేదు. అందుకే పూరి విజయ్ సినిమాని హైదరాబాద్ లోనే ఏదో ఒక సెట్ వేసి షూట్ చెయ్యాలనే నిర్ణయంతో ఉన్నారనే టాక్ వినబడుతుండగా.. తాజాగా... ప్రభాస్ రాధాకృష్ణ సినిమా పరిస్థితి కూడా అలానే ఉందని అంటున్నారు.
ప్రభాస్ - రాధాకృష్ణ సినిమా ఎక్కువ శాతం విదేశాల్లోనే షూటింగ్ జరగాల్సి ఉంది. ఆస్ట్రియా, జార్జియా, యూరప్ అంటూ సినిమా కథలో రాసుకున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితి విదేశాలకు షూటింగ్స్ కోసం వెళ్లేలా లేదు. అందుకే రాధాకృష్ణ ప్రభాస్ సినిమా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడట. లాక్ డౌన్ తో ఫ్రీగానే ఉన్న రాధాకృష్ణ ఫారెన్ లో షూట్ చేయాల్సిన కొన్ని సన్నివేశాలను ఇండియాలోనే షూట్ చేసేలా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారట. లాక్ డౌన్ అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట.