Advertisement
Google Ads BL

విజయ్‌తో ఇంద్రగంటి సినిమా.. నిర్మాత ఎవరంటే?


ప్రస్తుతం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్. పూరి జగన్నాధ్‌తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పాన్ ఇండియా లెవల్లో క్రేజీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి ఇండియా వైడ్‌గా క్రేజ్ పెరిగింది. ఇక ఈ సినిమా తర్వాత కూడా మరో రెండు ప్రాజెక్టులను విజయ్ దేవరకొండ ప్రకటించాడు. శివ నిర్వాణతో ఓ సినిమా అలాగే దిల్ రాజు నిర్మాతగా మరో సినిమా అన్నాడు కానీ.. దిల్ రాజు బ్యానర్ లో ఏ దర్శకుడితోనో చెప్పకుండా విజయ్ దేవరకొండ సస్పెన్స్ లో పెట్టేసాడు. అయితే తాజాగా ఆ సినిమాకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్టర్ కావొచ్చని ఊహాగానాలు ప్రస్తుతం సోషల్ మీడియాని చుట్టేసాయి.

Advertisement
CJ Advs

ఆ ఊహాగానాలకు కారణం ఏమిటంటే.. విజయ్ దేవరకొండ పుట్టిన రోజున ఇంద్రగంటి మోహన కృష్ణ విజయ్ కి శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేసాడు. మీరు చెయ్యబోయే అద్భుతమైన పనుల గురించి మేము ఎదురు చూస్తున్నాం అని ట్వీట్ చెయ్యగా దానికి విజయ్ దేవరకొండ బదులుగా మనమిద్దరం కలిసి చెయ్యబోయే అద్భుతమైన పని గురించి నాకు తెలుసుగా అంటూ రీ ట్వీట్ చేసాడు. అయితే వీరి సంభాషణను బట్టి.. ఇంద్రగంటి ఇప్పటికే విజయ్ దేవరకొండకి ఓ కథ వినిపించాడని.. ఆ కథ నచ్చి విజయ్ దిల్ రాజు బ్యానర్ లో చెయ్యడానికి సై అన్నాడని  టాక్ వినబడుతుంది. మరి ఇంద్రగంటి ‘వి’ సినిమా రాక కోసం ఎదురుచూస్తున్నాడు. తర్వాత నాగ చైతన్యతో ఓ సినిమా చేస్తాడని ప్రచారం ఉంది. ఆ తర్వాతే విజయ్ తో సినిమా ఉంటుంది అంటున్నారు.

Vijay deverakonda and Indraganti Mohan Krishna Film details :

Dil Raju Producer for Vijay and Indraganti combo Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs