వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, వరుసగా సినిమాలని ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వి చిత్రం లాక్డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. వి షూటింగ్ పూర్తికాగానే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే వినూత్నమైన చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా షూటింగ్ లో కొద్దిరోజులు పాల్గొన్నాడో లేదో కరోనా లాక్డౌన్ స్టార్ట్ అయింది.
అయితే శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న టక్ జగదీష్ తర్వాత నాని ఎవరి దర్శకత్వంలో నటించనున్నాడనేది ఆసక్తిగా మారింది. శ్యామ్ సింగరాయ్ అనే టైటిల్ తో సాయిపల్లవి హీరోయిన్ గా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటించినప్పటికీ, ఈ సినిమా ఉంటుందా, ఉండదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో నాని తర్వాతి చిత్రంపై మళ్లీ ఆసక్తి చెలరేగింది.
మెంటల్ మదిలో సినిమాతో ఆకర్షించిన వివేక్ ఆత్రేయతో నాని పనిచేయనున్నాడని ప్రచారం జరుగుతుంది. బ్రోచేవారెవరురా సినిమాతో మంచి హిట్ అందుకున్న వివేక్ ని మైత్రీ మూవీ మేకర్స్ లాక్ చేసిందని సమాచారం. మైత్రీఇ మూవీ బ్యానర్ లోనే నాని హీరోగా ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. ఆల్రెడీ నాని కథ విన్నాడట. కన్ఫర్మ్ చేయడమే ఆలస్యమట.