ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, నాని జాలిసి నటించిన ‘వి’ ద మూవీ ఈపాటికే థియేటర్స్‌లో దిగాల్సింది. నాని విలన్ గా సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన వి సినిమా కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడింది. తాజాగా సుధీర్ బాబు పుట్టిన రోజు నాడు సుధీర్ బాబు వి సినిమా ముచ్చట్లను అభిమానులతో పంచుకున్నాడు. అందులో భాగంగా సుధీర్ బాబు అసలు నాని తన సినిమాలో విలన్ గా చేస్తానని బాలీవుడ్ భాగీ సినిమా చేసినప్పుడే చెప్పాడని... ఆ సినిమా చూసాక వి సినిమాలో నేను విలన్ రోల్ చేస్తా అని చెప్పిన నానితో ఇంద్రగంటి వి సినిమా చేయించారని చెప్పాడు.
అంతేకాకుండా తాను ఇంద్రగంటి తో సమ్మోహనం సినిమా చేసినప్పుడే వి సినిమా కథని ఇంద్రగంటి వినిపించారని.. అయితే ఆ కథతో మహేష్ తో పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే బావుంటుంది అని నాతో చెప్పాడని అంటున్నాడు సుధీర్ బాబు. కానీ మహేష్ ని ఇంద్రగంటి సంప్రదించాడో లేదో కానీ.. నాకు ఫోన్ చేసి వి సినిమాలో హీరో నువ్వు అని చెప్పగానే తనకిష్టమైన పాత్ర ఇచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది అని.. ఇక నాని కూడా ఈ విలన్ క్రేజీ రోల్ ఒప్పుకోవడంతో సినిమాపై మరింత క్రేజ్ వచ్చింది అని చెబుతున్నాడు. మరి ఇంద్రగంటి గనక మహేష్ - పవన్ తో వి సినిమా చేసినట్టయితే... థియేటర్స్ దద్దరిల్లిపోయేవి. మహేష్ - పవన్ అభిమానులు బాక్సాఫీసుని షేక్ చేసి పారేసేవారు.