Advertisement
Google Ads BL

ఈ మెగా హీరో ముంబైకి వెళ్లిపోతున్నాడా?


ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా మూవీస్‌కి ఎగ బడుతున్నారు. ప్రభాస్ బాహుబలితో ఎంట్రీ ఇచ్చి సాహోతో బాలీవుడ్‌లో పేరు నిలబెట్టుకున్నాడు. మరోపక్క చిరు సైరా బాగా దెబ్బేసింది. తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు RRR తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా పుష్ప అంటూ పాన్ ఇండియా ఫిలిం మొదలెట్టాడు. మరోపక్క విజయ్ దేవరకొండ ఇప్పటికే పాన్ ఇండియా మూవీ షూటింగ్ కూడా సగం పూర్తి చేసాడు. అయితే విజయ్ కోసం పూరి జగన్నాధ్ ముంబై లో ఓ ఆఫీస్ ఓపెన్ చేసాడు కూడా.

Advertisement
CJ Advs

అయితే అందరూ పాన్ ఇండియా ఫిలిమ్స్ చేస్తున్నప్పటికీ ముంబై లో ఉండేలా ఓ ఇల్లు కొనేందుకు మాత్రం ప్లాన్ చెయ్యలేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం పుష్ప తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతూ ముంబై మకాం గురించి ఆలోచించేస్తున్నాడు. ముంబై అంటే ఇష్టమని చెబుతున్న అల్లు అర్జున్ ముంబైలో ఓ ఇల్లు కొనే ప్లాన్ లో ఉన్నాడట. అల్రెడీ అతనికి అక్కడొక అపార్ట్‌మెంట్ కూడా ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అన్ని హంగులతో హైదరాబాద్ లో అల్లు అర్జున్ ముచ్చటపడి కట్టించుకున్న ఇంట్లోకి త్వరలోనే మారబోతున్నాడు. అలాగే ఇక్కడ కార్పొరేట్ లెవల్లో ఓ ఆఫీస్ కూడా తెరవబోతున్నాడు. మరో పక్క ముంబై పాన్ ఇండియా ఫిలిమ్స్ కి అనుకూలమని అల్లు అర్జున్ అక్కడ ఇల్లే కొనేస్తున్నాడట. ముంబై ప్లాన్స్ వెనక కూడా ప్లానింగ్ చాలానే ఉంది. ఎప్పటినుండో బన్నీ ముంబై ప్లాన్స్ ఉన్నాయని సరైన కథ దొరక్క వెళ్లలేదని కానీ పుష్పతో ఇప్పుడు అది సాధ్యమైంది అని అంటున్నారు.

Allu Arjun Own House in Mumbai:

Allu Arjun Pan India plans Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs