Advertisement
Google Ads BL

అకీరా నందన్ ఇలా షాకిచ్చాడేంటి..?


పవన్ కళ్యాణ్ సినిమాల్లో టాప్ హీరోనే. సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఫ్యాన్స్ పరంగా పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా.. అయితే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ పెళ్లాడకుండానే అకీరాకి తల్లితండ్రులయ్యారు. అకీరా పుట్టాకే పవన్ - రేణు పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆద్య పుట్టింది. ఏవో విభేదాల వలన పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి విడాకులిచ్చాడు. అయితే పవన్ రేణుకి విడాకులిచ్చినా ఆద్య, అకీరాలను తరుచు కలుస్తూనే ఉంటాడు. అకీరా మెగా ఫ్యామిలీకి దగ్గరగానే ఉంటాడు.

Advertisement
CJ Advs

అయితే అకీరా సినిమా ఎంట్రీ ఎప్పుడా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఇక అకీరా నచ్చిన మెచ్చిన హీరో తన తండ్రి పవన్ కళ్యాణ్ కాదట. మరెవరంటే ‘ఎవరు’ సినిమా హీరో అడవి శేష్ అంటున్నాడు. మీకు నచ్చిన హీరో ఎవరు అని అడిగితే పవన్ కళ్యాణ్ అంటాడేమో అనుకుంటే... అకీరా ఇలా అడవి శేష్ అంటూ అందరికి షాకిచ్చాడు. ‘ఎవరు’ సినిమా చూసినప్పటి నుంచి అకీరా.. అడవి శేష్‌ని బాగా ఇష్టపడుతున్నాడని, నా ఫేవరేట్ హీరో అతనేనని చెప్పాడని ఇటీవల ఓ ఇంటర్య్యూలో రేణుదేశాయ్ తెలిపింది. మరి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే కానీ.. అడవి శేష్ హీరోయిజం అంటే మరింత ఇష్టమన్నమాట.

Akira Nandan gives shock to Mega fans:

Akira Nandan likes young Hero Adivi Sesh says Renu Desai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs