ప్రస్తుత జనరేషన్‌ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం ‘మ్యాడ్’. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ అందరిని ఆకర్షిస్తోంది. మోదెల టాకీస్ బ్యానర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు మిత్రులు నిర్మాతలుగా లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ లీడ్ రోల్స్ ప్లే చేశారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ.. ‘‘8వ తేది రిలీజ్ చేసిన ఫ్రీ లుక్ కి చాలా మంచి రెస్పాన్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. మన చుట్టూ జరుగుతున్న కొన్ని జీవితాల నుండి ప్రేరణ పొంది అంతే సహజంగా ఈ కథని చెప్పడం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఒక జంట, లివింగ్ రిలేషన్‌లో ఉన్న మరోజంట జీవితాల్లో ఎలాంటి మలుపులు జరిగాయన్నది హృద్యంగా చెప్పడం జరిగింది. చిత్ర కథనం, సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ఈ సినిమా చూసే ప్రేక్షకులకి నిత్యం మనకి తారసపడే మోడరన్ జంటల లైఫ్ స్టైల్ ని చూస్తున్న ఫీల్ కలుగుతుంది. హీరో, హీరోయిన్లు వారి వారి పాత్రల్లోకి ఇమిడిపోయి చాలా సహజంగా నటించారు. ఈ సినిమాకి రెహమాన్ స్కూల్ నుండి వచ్చిన మోహిత్ రెహ్మానియాక్ అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంటుంది. పద్మశ్రీ కైలాష్ ఖేర్ ఇష్టపడి పాడిన సూఫీ పాట చిత్రానికి మరో హైలైట్ గా నిలుస్తుంది. ఈ చిత్రం కాన్సెప్ట్ గురించి తెలుసుకుని, పాటలు విన్న వెంటనే ‘మధుర’ ఆడియో వారు తాము రిలీజ్ చేస్తామని ముందుకు రావడంతో ఈ నెల 14వ తేది ఫస్ట్ సింగల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. కొత్త నటీనటులు, టెక్నీషియన్లతో నిర్మించిన ‘మ్యాడ్’ ఈతరం ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాము..’’ అని అన్నారు.
నటీనటులు.. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ , తదితరులు నటించగా..
బ్యానర్: మోదెల టాకీస్
ప్రోడ్యూసర్స్: టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి మరియు మిత్రులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ ఏలూరు
కెమెరా: రఘు మందాటి
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: మోహిత్ రెహ్మానియాక్
లిరిక్స్: ప్రియాంక, శ్రీరామ్
పిఆర్ఓ: జియస్ కె మీడియా