Advertisement
Google Ads BL

అప్పుడు చాలా తప్పులు చేశా: పూజా హెగ్డే


నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని చాలా సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ కెరీర్ ని ఇప్పుడిప్పుడే లైన్ లో పెట్టుకుంటుంది హీరోయిన్ పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ‘అల వైకుంఠపురములో’ లాంటి మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది పూజా. రీసెంట్ గా ఈమె ఓ ఇంటర్వ్యూ లో తన కెరీర్ గురించి చాలా విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా ఆమెను ‘‘మీ కెరీర్ స్టార్టింగ్ లో పోల్చుకుంటే కథలు విషయంలో ఇప్పుడు మార్పులు ఏమైనా వచ్చాయా?’’ అని అడుగగా.. అందుకు ఆమె చాలా ఇంట్రెస్టింగ్ గా సమాధానం ఇచ్చింది.

Advertisement
CJ Advs

కెరీర్ స్టార్టింగ్ లో నేను కథలు విషయంలో చాలా తప్పులు చేశా. ఇప్పుడు దాని ఫలితంగానే కథల విషయంలో మార్పులు వచ్చాయి. కొన్నికొన్ని సార్లు చిన్న పాత్రలు అయినా మనసులో నాటుకుపోతాయి. అలా చేసిన సినిమానే ‘గద్దలకొండ గణేష్’. అందులో నేను చేసిన శ్రీదేవి పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. నేనా చిత్రంలో కనిపించింది కొద్దిసేపైనా ఆ పాత్ర ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచిపోయే పాత్ర అయింది. అటువంటి పాత్రలు ఏమన్నా వస్తుంటే వెంటనే అది చిన్న పాత్ర అయినా ఓకే చెప్పేస్తున్నా. కొన్ని సార్లు డైరెక్టర్స్ ని చూసి కథలు నమ్మేయాల్సి ఉంటుంది. అలా త్రివిక్రమ్ సార్ విషయంలో జరుగుతుంది. కానీ ‘అల వైకుంఠపురములో’ సినిమా నన్ను ఆకర్షించింది. ఆ సినిమా కథ చెబుతున్నప్పుడే నేను చాలా ఎంజాయ్ చేశాను.. అంటుంది పూజా.

Pooja Hegde about Her Selected Stories:

I did so many mistakes in Early Stage says pooja Hegde
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs