Advertisement
Google Ads BL

‘రెడ్‌’ ఇట‌లీ ట్రిప్ జ్ఞాపకాలు బయటపెట్టిన నిర్మాత!!


‘‘కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను అవ‌త‌లివాళ్లు చెబుతుంటే ఆశ్చ‌ర్యంగా ఉంటుంది. మ‌రికొన్నిసార్లు న‌మ్మ‌బుద్ధి కాదు. ఆ మాట‌ల్లో అతిశ‌యోక్తులు ధ్వ‌నిస్తాయి. కానీ అలాంటిసంఘ‌ట‌న‌లు  మ‌న జీవితంలో ఎదురైన‌ప్పుడు? అవే దృశ్యాలు మ‌ళ్లీ మ‌ళ్లీ క‌ళ్ల ముందుమెదులుతుంటాయి. ఇప్పుడు  మా ‘రెడ్‌’ యూనిట్ స‌భ్యులకు మెదిలిన‌ట్టు. మా ‘రెడ్‌’ టీమ్‌లో ఈ మ‌ధ్య  దీనికి సంబంధించిన చ‌ర్చే ఎక్కువ‌గా జ‌రుగుతోంది’’ అని అంటున్నారు ప్ర‌ముఖ నిర్మాత ‘స్ర‌వంతి’ ర‌వికిశోర్‌. ఆయ‌న తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ‘రెడ్‌’. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇందులో హీరోగా న‌టించారు. ఫిబ్రవరిలో ఈ చిత్రంలోని రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ ఇట‌లీలో జ‌రిగింది. కోవిడ్ 19తో అల్ల‌ల్లాడుతున్నఇట‌లీ గురించి, అక్క‌డ ఆ వైర‌స్ సోక‌డానికి కొన్నాళ్ల ముందు గ‌డిపిన క్ష‌ణాల గురించి ‘స్ర‌వంతి’ ర‌వికిశోర్ వివ‌రించారు. 

Advertisement
CJ Advs

‘స్ర‌వంతి’ ర‌వికిశోర్ మాట్లాడుతూ.. ‘‘స‌ముద్ర మ‌ట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో మైన‌స్ఐదు డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌తో, ఎటుచూసినా స్వ‌చ్ఛంగా సుంద‌రంగా  ఉంటుంది డోల‌మైట్స్. ఈప‌ర్వ‌త తీర ప్రాంతంలో ఇప్ప‌టిదాకా ప‌లు హాలీవుడ్ సినిమాల షూటింగులు జ‌రిగాయి. తెలుగు సినిమాల షూటింగ్‌లు ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు రామ్‌తో తీస్తున్న ‘రెడ్‌’ షూటింగ్ అక్క‌డ చేద్దామ‌ని మా డైర‌క్ట‌ర్ కిశోర్ తిరుమ‌ల అన్నారు. అప్ప‌టికే ఆ ప్రాంతం గురించి తెలుసు కాబ‌ట్టి వెంట‌నే ఓకే అనుకున్నాం. రెండు పాట‌లు చిత్రీక‌రించ‌డానికి టీమ్‌తో ఇట‌లీ చేరుకున్నాం. టుస్కాన్‌, ఫ్లారెన్స్, డోల‌మైట్స్ లో హీరో రామ్‌, హీరోయిన్మాళ‌విక మీద పాట‌లు చిత్రీక‌రించాం. రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘నువ్వే నువ్వే’ లిరిక‌ల్సాంగ్ లో లేక్ గార్డా అందాలు కూడా క‌నిపిస్తాయి. లేక్ గార్డా ప్ర‌స్తావ‌న ఎందుకంటే... ఈప్రాంతం బెర్గామోకి కేవ‌లం గంటంపావు ప్ర‌యాణ దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఇట‌లీలో కోవిడ్ 19కి ఎపిక్ సెంట‌ర్‌గా బెర్గామో గురించి అంద‌రికీ తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి15న లేక్ గార్డ‌ాలోనూ, ఫిబ్ర‌వ‌రి 16న డోల‌మైట్స్ లోనూ షూటింగ్ చేశాం. మేం అక్క‌డి నుంచితిరిగి ఇటొచ్చిన ఆరు రోజుల‌కు... అంటే ఫిబ్ర‌వ‌రి 22న డోల‌మైట్స్ కి బ్రిటిష్ స్కై టీమ్వెళ్లింది. అక్క‌డికి వెళ్లిన 22 మందిలో 17 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. అప్ప‌టిదాకా సుంద‌రంగా, ఫెంటాస్టిక్ ఎక్స్‌పీరియ‌న్స్ గా అనిపించిన డోల‌మైట్‌ గురించి ఆలోచించ‌గానే మ‌మ్మ‌ల్ని క‌రోనా క‌ల‌వ‌ర‌పెట్టింది. జ‌స్ట్ వారం రోజులు ముందుగా అక్క‌డినుంచి వ‌చ్చిన మా యూనిట్ అంతా  సుర‌క్షితంగా ఉంది. 

ఇలాంటి విష‌యాల గురించి ఆలోచించిన‌ప్పుడు అదృష్టం కాక మ‌రేంటి? అని అనిపిస్తుంది. ఈ విష‌యాన్నే అక్క‌డపాట‌ల‌కు కొరియోగ్ర‌ఫీ చేసిన శోభి మాస్ట‌ర్‌, మా యూనిట్ స‌భ్యులు గుర్తుచేస్తున్నారు. ఇట‌లీలోనే కాదు మ‌న ద‌గ్గ‌రా క‌రోనా క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ వైర‌స్ బారి నుంచి త‌ప్పించుకోవ‌డ‌మే మ‌న ముందున్న క‌ర్త‌వ్యం. మాన‌వాళి సుర‌క్షితంగా ఉండాల్సిన ఈ త‌రుణంలో వినోదం గురించి ఆలోచించ‌డాన్ని మేం కూడా వాయిదా వేశాం. ఏప్రిల్ 9న విడుద‌ల చేయాలనుకున్నాం. స‌మాజం మామూలు స్థితికి వ‌చ్చాక‌, అప్పుడు ‘రెడ్‌’ విడుద‌ల గురించి ప్ర‌క‌టిస్తాం. క‌రోనా కోర‌ల్లో చిక్కుకోకుండా ఉండాలంటే అంద‌రూ ఇళ్ల‌ల్లోనే ఉండాలి. ప‌రిశుభ్ర‌త‌ను పాటించాలి’’ అని అన్నారు. 

రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ తదితరులు నటించిన ‘రెడ్‌’  చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్‌, దర్శకత్వం: కిశోర్‌ తిరుమల.

Sravanthi Ravi Kishore talks about Red Italy Trip incidents:

Sravanthi Ravi Kishore on Red Movie shooting in Italy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs