Advertisement
Google Ads BL

శర్వానంద్ పాన్ ఇండియా ప్లాన్..?


గత కొన్ని రోజులుగా శర్వానంద్ వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు.వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా విజయాలు మాత్రం దక్కడం లేదు. శతమానం భవతి సినిమా తర్వాత మళ్లీ అంతటి బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయిన శర్వానంద్, విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను సినిమాలు నిరాశకి గురి చేశాయి. ప్రస్తుతం 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న శ్రీకారం సినిమా హిట్ అందిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

Advertisement
CJ Advs

నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే, శర్వానంద్ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. కార్తికేయ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చందూ మొండేటి శర్వానంద్ తో సినిమా తీయడానికి సిద్ధం అవుతున్నాడట. ఇప్పటికే కథ కూడా వినిపించాడని టాక్. కథ నచ్చిన శర్వానంద్ చందూకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అయితే యూనివర్సల్ ఆక్సెప్టెన్స్ ఉన్న ఆ కథని పాన్ ఇండియా రేంజ్ లో తీస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.

అయితే ఇది కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది తెలియాలి. చందూ మొండేటి ప్రస్తుతం నిఖిల్ తో కార్తికేయ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన అనంతరం చందూ, శర్వానంద్ తో సినిమా స్టార్ట్ చేస్తాడని అంటున్నారు. తెలుగులోనే మార్కెట్ అంతకంతకూ తగ్గుతున్న తరుణంలో శర్వా పాన్ ఇండియా ప్లాన్ చేస్తున్నాడనే వార్తల్లో నిజం ఉండదని భావిస్తున్నారు. ఈ విషయమై శర్వా ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Sharwanand Wants to make Pan India film..?:

Sharwanand pan India movie with Chandu Mondeti
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs