Advertisement
Google Ads BL

కూతురు సెంటిమెంట్ తో బాలయ్య సినిమా..?


నందమూరి బాలక్రిష్ణ ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేస్తుంటాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కుడా యాక్షన్ సినిమానే అని టాక్. నందమూరి అభిమానులు బాలయ్య నుండి కోరుకునేది యాక్షనే కాబట్టి, బాలయ్య ఇప్పటి వరకూ అలాంటి సినమాలే చేస్తూ వచ్చాడు. అయితే రూలర్ సినిమా పరాజయం తర్వాత బాలయ్య మనసు మారిందని అంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త కొత్త కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

యువ దర్శకులు విభిన్నమైన కథలతో తెలుగు చిత్రపరిశ్రమకి కొత్తదనాన్ని తెస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య కూడా తన సినిమాలో విభిన్నమైన అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడని వినబడింది. బోయపాటి సినిమాలో అఘోరా పాత్ర చాలా బాగుంటుందని అంటున్నారు. ఇకపోతే బాలయ్య మరో సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ బయటకి వచ్చింది. బోయపాటి తర్వాత సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతుంది.

మాటల రచయితగా గుర్తింపు తెచ్చుకున్న బుర్రా సాయిమాధవ్ ఈ సినిమా స్క్రిప్టుని సిద్ధం చేశాడట. అయితే ఈ సినిమా కూతురు సెంటిమెంట్ తో చాలా ఎమోషనల్ గా సాగుతుందట. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసరుగా కనిపించనున్నాడట. మరి ఇలాంటి పాత్రని అభిమానులు అంగీకరిస్తారా అన్నది చూడాలి. ఇప్పటికైతే ఈ సినిమాపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

emotional script for Balayya..?:

Emotional script for balayya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs