Advertisement
Google Ads BL

మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్న ‘A’ చిత్రం ఫస్ట్ లుక్


థ్రిల్లర్ జోనర్లో వస్తున్న తెలుగు సినిమా అనగానే ఏదో ఒక ఇంటర్నేషనల్ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఉంటుంది అనుకుంటారు. కానీ తొలిసారి ఓ తెలుగు సినిమా ఇప్పటివరకు ప్రపంచంలో ఏ భాషలో రానటువంటి సరికొత్త కథాంశంతో తెరకెక్కిన అసలుసిసలైన థ్రిల్లర్ ‘A’, అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఇటీవల రిలీజైన టైటిల్ పోస్టర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి సినిమాలోనే 3 పాత్రల్లో నటిస్తున్న నితిన్ ప్రసన్న దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని, పాత్రల మధ్య వ్యత్యాసం కొరకు ఎన్నో గెటప్స్‌ని ట్రై చేస్తూ, నెలల తరబడి రిహార్సల్స్ చేసి, అద్భుతంగా పోషించి అందరిని మెప్పించాడు. బడ్జెట్ పరిమితిని దాటకుండా, సాధ్యమైనంత వరకు VFX ఉపయోగాన్ని తగ్గించి, పాత కెమెరా ట్రిక్‌లను వాడి, మూడు పాత్రలు గల సన్నివేశాలని చిత్రీకరించారు. దీనికోసం సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌కు స్టోరీబోర్డ్ గీయించారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా డైరెక్టర్ యుగంధర్ ముని మాట్లాడుతూ.. ఈ సన్నివేశాల చిత్రీకరణకు ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారిని ఆదర్శంగా తీసుకున్నానన్నారు. కంటెంట్ పరంగా తెలుగు సినిమా స్థాయిని మా A చిత్రం మరింత పెంచేలా ఉంటుందని గర్వంగా చెప్పగలమన్నారు. 

నితిన్ ప్రసన్న, ప్రీతీ అశ్రాని(మళ్లీరావా, ప్రెసర్ కుక్కర్), స్నేహల్ కమత్, బేబీ దీవెన (జబర్దస్త్), రంగధామ్, కృష్ణవేణి, భరద్వాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు.

Extraordinary first Look from A Movie :

Telugu A Movie First Look poster Released 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs