Advertisement
Google Ads BL

‘విరాట‌ప‌ర్వం’ సాయిప‌ల్ల‌వి లుక్ విడుదల


రానా చిత్రం ‘విరాట‌ప‌ర్వం’లో సాయిప‌ల్ల‌వి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Advertisement
CJ Advs

ఆమె చేసిన చిత్రాలు, పాత్ర‌లే ఆమె ఎలాంటి న‌టో తెలియ‌జేస్తాయి. మునుపటి చిత్రాలలో సూప‌ర్బ్‌ స్క్రీన్‌-ప్రెజెన్స్‌, అద్భుతమైన నటనతో ఆ చ‌లాకీ తార అనేక‌ మంది హృదయాలను కొల్లగొట్టింది. అవును, మనం మాట్లాడుతున్న నటి మరెవరో కాదు.. సాయిపల్లవి. ఈ రోజు ఆమె పుట్టిన‌రోజు. ఈ ప్రత్యేక సందర్భంగా, త‌ను న‌టిస్తోన్న తాజా చిత్రం ‘విరాటపర్వం’లో సాయిపల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. వాస్తవానికి, ఇది రెగ్యుల‌ర్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ కాదు. ఇక్కడ సాయిపల్లవి అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఎవరి కోస‌మో ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఈ సమయంలో ఆమె తన ఆలోచ‌న‌ల‌ను రాసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆమె డ్రెస్సింగ్ ఇతర సాధారణ తెలుగింటి అమ్మాయిల మాదిరిగా చాలా సింపుల్‌గా ఉంది. కానీ, ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేది, త‌ను ఎక్కువగా ఇష్టపడేవారి కోసం ఎదురుచూడ్డంలో ఆమె అనుభవిస్తున్న బాధ.

‘విరాటపర్వం’ ఒక ప్రత్యేకమైన, కంటెంట్ ప్ర‌ధాన‌ చిత్రం. ఇందులో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇదివ‌ర‌కెన్న‌డూ మ‌నం చూడ‌ని పాత్ర‌ల్లో హీరో హీరోయిన్లను ఈ చిత్రం చూపించ‌బోతోంది. లాక్‌డౌన్ విధించకపోతే, ఈ చిత్రం ఈ స‌రికి విడుదలకు సిద్ధంగా ఉండేది. చిన్న‌పాటి చివరి షూటింగ్ షెడ్యూల్ మినహా, మొత్తం చిత్రీకరణ పూర్తయింది. ‘నీదీ నాదీ ఒకే క‌థ’ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ‘విరాట‌ప‌ర్వం’ చిత్రాన్ని డి. సురేష్‌బాబు స‌మ‌ర్పిస్తోండ‌గా, శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

 

రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావు, సాయిచంద్‌, బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ‌, దేవీప్ర‌సాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్ర‌పాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

సాంకేతిక బృందం:

ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వేణు ఊడుగుల‌

నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి

బ్యాన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్‌

స‌మ‌ర్ప‌ణ‌: సురేష్‌బాబు

సినిమాటోగ్ర‌ఫీ: డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాక‌ర్ మ‌ణి

ఎడిట‌ర్‌: శ్రీ‌క‌ర ప్ర‌సాద్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ్రీ నాగేంద్ర‌

సంగీతం: సురేష్ బొబ్బిలి

స్టంట్స్‌: స్టీఫెన్ రిచ‌ర్డ్‌

కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ చాగంటి

ప‌బ్లిసిటీ డిజైన్‌: ధ‌ని ఏలే

Sai Pallavi’s First Look In Rana’s Virataparvam Released:

Birthday Special: Sai Pallavi Look from Virataparvam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs