Advertisement
Google Ads BL

సవాల్‌కి నేను రెడీ: దర్శకధీరుడు


ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో సినీ ప్రియులంతా ఓటిటీ ప్లాట్ ఫార్మ్స్ మీదే ఆధారపడ్డారు. ఎందుకంటే థియేటర్స్ బంద్ నడవడం చూసేందుకు సినిమాలు విడుదల కాకపోవడంతో... ప్రేక్షకులు అమెజాన్, నెట్ ఫ్లిక్స్, సన్ నెట్, హాట్ స్టార్ అంటూ అందులో ఉన్న వెబ్ సీరీస్ మీద పడ్డారు. అయితే కరోనా లాక్ డౌన్ ముగిసినా థియేటర్స్ కి ప్రేక్షకులు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితుల్లో దర్శకుడు రాజమౌళి లాక్ డౌన్ తర్వాత సినిమా పరిశ్రమలో భారీ మార్పులు జరగడం ఖాయమని అందులో భాగంగా కథలలో కొత్తదనం, ప్రేక్షకుల మైండ్ సెట్ కి తగట్టుగా మార్పులు చూపించాల్సిందే అంటున్నాడు.

Advertisement
CJ Advs

ఇక ప్రేక్షకులు ప్రస్తుతం ఓటిటీ ప్లాట్ ఫార్మ్ కి బాగా అలవాటు పడి థియేటర్స్ తెరుచుకున్నప్పటికీ.... సినిమా చూడాలనే ఆసక్తి తగ్గుతుందని.... అందుకే ఓటిటీ ప్లాట్ ఫార్మ్స్ కి మించి సినిమాలు తీయాల్సిందే అంటున్నారు దర్శక దిగ్గజాలు.. రాజమౌళి, నాగ్ అశ్విన్, నిర్మాత సురేష్ బాబు. డిజిటల్ మాధ్యమాల వలన ప్రపంచ సినిమాల రుచి తెలుసుకున్న ప్రేక్షకులకు సినిమాని ఓ మాదిరిగా తీస్తే ఆనదని.... ఓటీటీలలో వచ్చే కంటెంట్ కి మించి సినిమా తీయాల్సిందే అంటున్నాడు రాజమౌళి.

ఇక నాకు సవాళ్ళంటే ఇష్టం. కరోనా తర్వాత పరిస్థితులను బట్టి వాటిని ఓ సవాల్ గా తీసుకుని ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు తీస్తాను. సినిమాలో హీరో ఎంట్రీ సీన్ చూడాలంటే వందలాదిమంది ప్రేక్షకుల మధ్యలో అయితే బావుంటుంది కానీ.. ఒక్కరే చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని చూస్తే మజా ఉండదని.. ఇక బడ్జెట్ విషయంలో లగ్జరీలు తగ్గించుకోవాలని, అలాగే నటులు పారితోషకాలు తగ్గించుకుంటే.. సినిమా బడ్జెట్ తగ్గుతుంది అని.. ఇది అందరూ దృష్టిలో పెట్టుకుంటే బావుంటుంది అని... ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్. షూటింగ్ చెయ్యడానికి వందలాదిమంది కావాలి. కానీ నేటి పరిస్థితులు దానికి అనుకూలించవు. కొద్దిమందితో పని కానిచ్చేసి.. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తోనే సర్దుకుపోవాలి అని చెబుతున్నాడు టాప్ డైరెక్టర్ రాజమౌళి.

I Likes Challenges Says S S Rajamouli:

Rajamouli About Shooting After Lock Down
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs