ప్రస్తుతం బికినీలతో బీచ్ ఒడ్డున అల్లాడిస్తున్న రకుల్ ప్రీత్ ఒకప్పుడు బికినీ వేయాలంటే భయంగా ఉండేది. మిస్ ఇండియా పోటీలకు ప్రిపేర్ అవ్వాలంటే బికినీ వెయ్యాలని అమ్మ నాకెప్పుడూ చెబుతూ ఉండేదని.. కానీ బికినీ వేయాలంటే భయంగా ఉండేదని.. తర్వాత అమ్మ బికినీ వేస్తే ఏమవుతుంది అన్నిటికి సిద్ధంగా ఉండాలని నువ్వు తప్పకుండా పోటీలకు వెళ్లాలని మానసిక స్థైర్యం చెప్పేది. అలాగే నాన్న కూడా బికినీ వేస్తే అడ్డు చెప్పేవారు కాదని... ఇలాంటి విషయాల్లో తల్లితండ్రులు అడ్డు చెబుతారు కానీ... మా అమ్మ నాన్న మాత్రం నన్ను ప్రోత్సహించేవారని చెబుతుంది.
మరి అప్పుడు బికినీ వెయ్యడానికి భయపడిన రకుల్ ప్రీత్ ఇప్పుడు అందాలు ఆరబొయ్యడానికి కానీ... బికినీ వెయ్యడానికి కానీ వెనకాడడం లేదు. బికినీతో సెగలు రేపే రకుల్ ప్రీత్ గ్లామర్ చూపించడానికి ఎప్పుడు వెనకడుగువెయ్యలేదు. ఇక తన తండ్రి ఆర్మీలో పనిచేస్తూ బదిలీల మీద బదిలీలు అయ్యేవారని.. తమ్ముడు అమన్ ఆటలు ఆడేవాడని అందుకోసం తన తండ్రి ఉద్యోగం వదులుకున్నారని.. ఇప్పుడిలా నటిగా ఎత్తుకు ఎదిగానంటే అది నా తల్లితండ్రుల చలవే అంటుంది రకుల్ ప్రీత్.