లాక్డౌన్ వల్ల సినిమా పరిశ్రమకి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమా షూటింగులన్నీ ఆగిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం లాక్డౌన్ కి సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో ఆశాభావం వ్యక్తమైంది. మరొకొన్ని రోజుల్లో ఆంక్షల మధ్య చిత్ర షూటింగ్ జరుపుకోవచ్చనే అనుమతులు వస్తాయని అనుకుంటున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం వకీల్ సాబ్ ఇందుకు సిద్ధం అయ్యేలా కనిపిస్తుంది.
వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తికావడానికి వచ్చింది. షూటింగ్ కి పది రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదట. అందువల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసేయాలని డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. దానిలో భాగంగా ఎడిటింగ్ పనులు పూర్తి చేయాలని పవన్ సూచిస్తున్నాడట. ఎడిటింగ్ పూర్తికాగానే డబ్బింగ్ పనులు మొదలుపెట్టడానికి చూస్తున్నారట. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎమ్ సీ ఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.