Advertisement
Google Ads BL

అప్పుడు చరణ్ కోసం.. ఇప్పుడు ప్రభాస్ కోసం!


రామ్ చరణ్ ధృవ సినిమాలో అరవింద్ స్వామి నెగటివ్ కేరెక్టర్ చెలరేగిపోయాడు. రామ్ చరణ్ కన్నా బెస్ట్ పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే అప్పటినుండి అరవింద్ స్వామి మళ్లీ తెలుగులో కనబడలేదు. కానీ తాజాగా ప్రభాస్ సినిమాలో మరోసారి విలన్ కేరెక్టర్ చెయ్యబోతున్నట్టుగా లేటెస్ట్ న్యూస్. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘ఓ డియర్’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటుగా ప్రభాస్ నాగ్ అశ్విన్ తో పాన్ ఇండియా ఫిలిం అనౌన్స్ చేసాడు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ ప్రభాస్ తో సినిమాని ప్రకటించాడు.అది కూడా పాన్ ఇండియా ఫిలిం కావడం గమనార్హం.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ భామని ఎంపిక చేసే యోచనలో ఉన్న నాగ్ అశ్విన్.. విలన్ కేరెక్టర్ కోసం అరవింద్ స్వామిని సంప్రదించబోతున్నారనే టాక్ నడుస్తుంది. స్టైలిష్ విలనిజానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన అరవింద్ స్వామి.. ప్రభాస్ కి ప్రతినాయకుడిగా అయితే బావుంటుంది అని.. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణముగా ఫేస్ టు ఫేస్ కలవకపోయినా... అరవింద్ స్వామిని ఫోన్ లోనే నాగ్ అశ్విన్ సంప్రదించి.. ఆయన కేరెక్టర్ గురించి వివరించినట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే తన కేరెక్టర్ కాస్త స్టైలిష్ గా ఉండడం.. ఈ సినిమా పాన్ ఇండియా ఫిలిం కావడంతో అరవింద్ స్వామి కూడా ఈ కేరెక్టర్ ని ఒప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు.

Dhruva Villain for Prabhas and Nag Ashwin Film:

Aravind Swamy for Prabhas and Nag Ashwin Film 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs