Advertisement
Google Ads BL

పవన్, ఎన్టీఆర్‌ల గురించి ప్రణీత ఏమందంటే..?


హీరోయిన్స్ అందరూ కరోనా లాక్‌డౌన్‌లో జిమ్స్, యోగా అంటూ ఇంట్లోనే కష్టాలు పడుతుంటే... టాలీవుడ్ ఫేడవుట్ హీరోయిన్ ప్రణీత సుభాష్ మాత్రం పేదలకు అన్నదానాలు చేయడం, ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయపడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రణీత చాలా విషయాలు అందరితో పంచుకుంది.. పవన్ కళ్యాణ్ తో నటించి సూపర్ హిట్ కొట్టినప్పటికీ.. టాలీవుడ్లో నిలబడలేకపోయిన ప్రణీత ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసినప్పుడు లైఫ్ గురించి మాట్లాడుకునే వారమని.. పవన్ కళ్యాణ్ తో మరోసారి అవకాశం వస్తే బావుంటుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది.

Advertisement
CJ Advs

ఇక ఎన్టీఆర్ విలక్షణ నటుడు అని.. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అద్భుతమని.. రేర్ నటుల్లో ఆయన ఒకరని ఎన్టీఆర్ ని ఆకాశానికెత్తేసింది. ఇక టాలీవుడ్ లో నటించడం లేదు.. అవకాశాలు రావడం లేదా అని అడిగితే.. లేదు నాకు కథలు నచ్చడం లేదు, అవకాశాలు వస్తున్నాయి. కథ నచ్చితే సినిమా చేస్తా అంటుంది. ఇక బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో సినిమా చేస్తున్న.. బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్న అని చెప్పిన ప్రణీత సుభాష్.. అలియా భట్, దీపికా పదుకునే అంటే ఇష్టమని.. వాళ్ళు కెరీర్ లు మలుచుకున్న తీరు బావుంటుంది అని చెబుతుంది. ఇక పెళ్ళి గురించిన ఆలోచనలు ఇప్పుడప్పుడే లేవంటుంది. 

Pranitha Talks about Pawan Kalyan and Jr NTR:

Pranitha busy with help Programs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs