Advertisement
Google Ads BL

హైపర్ ఆదికి కొరియోగ్రాఫర్ స్ట్రాంగ్ వార్నింగ్


కాంట్రవర్సీలోనూ కామెడీని వెతుక్కునే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై ఒకప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ ఇప్పుడు కాంట్రవర్సీ స్టార్‌గా మారిన రాకేష్ మాస్టర్ బూతుల వర్షం కురిపించాడు. ఈయనకు ఇండస్ట్రీలో ఏ రేంజ్‌లో గుర్తింపు వచ్చిందో అంతకు డబుల్ కాంట్రర్సీగా మాట్లాడుతూ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇప్పటికే నందమూరి, మెగా ఫ్యామిలీనూ కెలికిన రాకేష్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆది ప్రస్తావన రాగా ఒంటికాలిపై లేచిన ఆయన బూతులు మాట్లాడేశాడు. ఇందుకు కారణం లేకపోలేదు.. ఓ ఎపిసోడ్‌లో ‘అన్నయ్యకు పెళ్లంట’ అని పాట పాడుతూ.. కొరియోగ్రఫీ చేసి చూపించాడు మాస్టర్. దీన్ని పేరడీగా వాడుకున్న ఆది పంచ్‌ల కురిపిస్తూ సెటైర్లేశాడు. దీంతో రాకేష్‌ మాస్టర్ బాగా సీరియస్ అయ్యాడు.

Advertisement
CJ Advs

అసలేం జరిగింది..!?

సమయం వచ్చింది కదా అని ఇంటర్వ్యూ వేదికగా ఆదికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ‘ఏరా ఆదీ.. నాపైనే కామెడీ చేస్తావా..?. దొరుకుతావురా తుపాకీ.. అప్పుడు నీకు ఉంటుందిరా ఆదీ. మంచి మ‌న‌సు ఉండాల‌ని నేను బూతులు మాట్లాడినా.. యోగి వేమ‌నలా ఉంటుంది. కానీ ఆది చేసేది మాత్రం క‌మ‌ర్షియ‌ల్ బిజినెస్. త్వర‌లోనే గొడ్డలిపెట్టు పడిపోతుంది’ అని ఆదిగా గట్టిగానే మాస్టర్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇలా వార్నింగ్‌లు ఇవ్వడాలు మాస్టర్‌కు కొత్తేం కాదు ఇదివరకే క్రిటిక్ కత్తి మహేశ్‌తో పాటు పలువుర్ని హెచ్చరించాడు. తాజా వ్యవహారంపై ఆది రియాక్షన్ ఎలా ఉంటుందో.. మరోసారి ఏదో ఒక కామెడీ షో మళ్లీ పంచ్‌లు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.

అది పొరపాటే..!

వాస్తవానికి.. ఆది ఇదివరకే ఇలా ఎవర్ని పడితే వాళ్లను కించపరుస్తూ కామెడీ చేశాడని.. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. అయితే కామెడీగానే కామెడీగా చూడొచ్చు కానీ.. ఇతరుల జీవితాలను కించపరుస్తూ చేయడం కామెడీ అంటే అది పొరపాటే.. ఇకపై ఇది తెలుసుకుని ఎవరి పనులు వాళ్లు చూసుకుంటే మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. కామెడీ అంటే కడుపుబ్బా నవ్వించాలంతే కానీ కాంట్రవర్సీతో హాట్ టాపిక్ అయ్యి గొడవలు పెట్టుకుని.. కనిపించిన చోట కుళ్లపొడిపించుకునే పరిస్థితులు తెచ్చుకోకూడదని క్రిటిక్స్ చెబుతున్నారు.

Choreographer Rakesh Master Stright Warning To Hyper Aadi:

Choreographer Rakesh Master Stright Warning To Hyper Aadi  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs