సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిలసౌ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించిన రుహానీ శర్మకి అదే మొదటి సినిమా అయిన మంచి పేరుని తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత రుహానీ శర్మకి అవకాశం రావడానికి బాగా టైమ్ పట్టింది. నాని నిర్మాతగా వ్యవహరించిన హిట్ సినిమాలో నటించి ఫర్వాలేదనిపించింది.
చిలసౌ సినిమాలో చాలా పద్దతిగా పక్కింటి అమ్మాయిగా కనిపించిన రుహానీ, హిట్ సినిమాలో ముద్దు సీన్లలో నటించి షాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకి అంతగా ప్రాధాన్యం లేదని ఒప్పుకోవాల్సిందే. ఇకపోతే కరోనా కారణంగా లాక్డౌన్ కొనసాగిస్తున్న సమయంలో సెలెబ్రిటీలందరూ ఏదో ఒకటి నేర్చుకుంటూ బిజీగా ఉంటున్నారు. అయితే రుహానీ తెలుగు భాషని నేర్చుకుంటుందిట.
భవిష్యత్తులో సినిమాల్లో నటించడానికి, తన డబ్బింగ్ తానే చెప్పుకోవడానికి వీలుగా ఉండేందుకు ఆన్ లైన్ వేదికగా తెలుగు మాటలని ఎలా పలకాలో నేర్చుకుంటుందట. ప్రస్తుతం రుహానీ చేతిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. ఎమ్ ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న డర్టీహరి చిత్రంలోనూ, శ్రీనివాస్ అవసరాల సరసన నూటొక్క జిల్లల అందగాడు సినిమాలోనూ నటిస్తుంది.