Advertisement
Google Ads BL

ఆదిత్య మూవీస్‌లో హీరో నితిన్ చిత్రాల‌ ప్రభంజనం


400 మిలియ‌న్ల వ్యూస్ సాధించిన ఆదిత్య మూవీస్ - హీరో నితిన్ హిందీ డ‌బ్బింగ్ చిత్రాలు

Advertisement
CJ Advs

సౌత్ ఇండియాలోనే అగ్ర‌గామి మ్యూజిక్ కంపెనీగా కొన‌సాగుతున్న ఆదిత్య మ్యూజిక్ వారు నిర్వ‌హిస్తున్న ఆదిత్య మూవీస్ విభాగానికి సంబంధించిన యూట్యూబ్ ఛాన‌ల్ లో అప్ లోడ్ చేసిన వివిధ తెలుగు హీరోల, హిందీ డ‌బ్బింగ్ సినిమాలకు భారీగా వ్యూస్ వ‌స్తున్నాయి. తాజాగా హీరో నితిన్ న‌టించిన సూప‌ర్ హిట్ సినిమాలు అఆ, చ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం హిందీ డ‌బ్ వెర్ష‌న్ కు ఓవ‌ర్ ఆల్ గా 400 మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం విశేషం. ఇందులో దాదాపు అఆ కు 182 మిలియ‌న్ల వ్యూస్, అ ఆ 2 (ఛ‌ల్ మోహ‌న్ రంగ హిందీ వెర్ష‌న్) కు 112 మిలియ‌న్ల వ్యూస్, శ్రీనివాస క‌ళ్యాణం కు 100 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. నితిన్ న‌టించిన ఈ మూడు సినిమాలుకి సంబంధించిన హిందీ డ‌బ్బింగ్ రైట్ ఆదిత్య మూవీస్ తోనే ఉన్నాయి. అలానే ఈ మూడు సినిమాలు నితిన్ కెరీర్ లో వ‌రుస‌గా రిలీజ్ అవ్వ‌డం విశేషం. 

ఈ సంద‌ర్భంగా సంస్ధ మేనెజింగ్ డైరెక్ట‌ర్ ఉమేశ్ గుప్త మాట్లాడుతూ, మా ఆదిత్య మూవీస్ ఛాన‌ల్ ని విశేషంగా ఆద‌రిస్తున్న వ్యూయ‌ర్స్ అంద‌రికీ నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను. త్రివిక్రమ్ గారు డైరెక్షన్ లో నితిన్ హీరో గా వచ్చిన అ ఆ సినిమాను హిందీలోకి డబ్బింగ్ చేయడంతోనే మా ఆదిత్య మూవీస్ మొదలైంది. సాధారణంగా యాక్షన్ మూవీస్ ఇష్టపడే నార్త్ ఆడియన్స్, అ ఆ వంటి ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ ని విశేషంగా ఆదరించారు. అనూహ్యంగా అ ఆ తరువాత కూడా నితిన్ నుంచి వచ్చిన చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాలకి భారీగా స్పందన లభించడం విశేషం అని తెలిపారు. నితిన్ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న న‌టించిన సినిమాల్లో దాదాపు 19 సినిమాలు ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారానే రిలీజ్ చేయడం జరిగిందని,  వాటిలో జ‌యం, దిల్, సై, ఇష్క్, అ ఆ,  భీష్మ  వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయని, ఇన్నేళ్లుగా మా సంస్థ పై న‌మ్మ‌కం ఉంచుతూ వస్తున్న నితిన్ గారికి ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞత‌లు, అభినంద‌న‌లు తెలుపుతున్నాను అన్నారు. 

డైరెక్ట‌ర్ ఆదిత్య గుప్త మాట్లాడుతూ మమ‌ల్ని ఆదిరిస్తున్న అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌కి మేము ఎల్ల‌ప్పుడూ రుణప‌డి ఉంటాము. అలానే మ‌మ‌ల్ని న‌మ్మి మాకు అవ‌కాశం ఇచ్చిన హీరో నితిన్ గారికి, దర్శ‌క నిర్మాత‌ల‌కు నా అభినంద‌న‌లు, ధన్య‌వాదాలు అని అన్నారు.

Young Hero Nithiin Scores A Hatrick On Aditya Movies:

<span>Aditya Movies, the Hindi dubbed movies channel of Aditya Music has created history with more than 100million views for not one or two but three blockbusters in a row</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs