Advertisement
Google Ads BL

జగదేకవీరుడు అతిలోక సుందరి ఎలా స్టార్ట్ అయ్యిందటే..


మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా గురించి ఆసక్తికర విషయాలని వెల్లడించడానికి చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సిద్ధమైంది. నేచురల్ స్టార్ నాని మాటల్లో ఈ సినిమా గురించి మనకి తెలియని  విషయాలని రివీల్ చేస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో అఖండ విజయం అందుకుని, ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేని చిత్రంగా నిలిచిన సినిమా ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పాడు నాని.

Advertisement
CJ Advs

నిర్మాత అశ్వనీదత్ గారికి ఎప్పటి నుండో భారతీయ సినిమా గర్వపడేలా సోషియో ఫాంటసీ చిత్రం తీయాలని ఉండేదట. ఆ సినిమాని చిరంజీవి హీరోగా, రాఘవేంద్రరావుగారే దర్శకత్వం వహించాలని అనుకున్నాడట. ఒకసారి రాఘవేంద్రరావుగారు, రచయిత శ్రీనివాస్ చక్రవర్తి గారు తిరుమల వెళ్ళినపుడు శ్రీనివాస్ చక్రవర్తి గారు మాటల్లో జగదేకవీరుడు కథని ఒక లైన్లో చెప్పాడట. ఒక దేవకన్య తన ఉంగరం పోగొట్టుకుని వెతుక్కోవడానికి భూమ్మీదకి వస్తుంది. ఆ ఉంగరం చిరంజీవికి దొరుకుతుందని చెప్పాడట.

ఈ లైన్ అశ్వనీదత్ గారికి బాగా నచ్చి, రచయితలైన యండమూరి వీరేంద్రనాథ్, జంధ్యాల, సత్యమూర్తి వాళ్లకి డెవలప్ చేయమని అప్పగించాడట. వాళ్ళు డెవలప్ చేసి జగదేకవీరుడు అతిలోకసుందరిని స్క్రిప్టుని పూర్తి చేశారని నాని చెప్పాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలని వెల్లడించనున్నారట.

Nani revealed interesting facts about JVAS..:

Nani Revealed how JVAS movie was started
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs