Advertisement
Google Ads BL

నటనలో ఆయనే నాకు స్ఫూర్తి.. సందీప్ కిషన్..


హీరోగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సందీప్ కిషన్, ప్రస్తుతం చేస్తున్న ఏ౧ ఎక్స్ ప్రెస్ పై బాగా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా నుండి రిలీజైన పాటకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. హాకీ క్రీడా నేపథ్యంగా సాగే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కనిపిస్తుంది. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న సందీప్ కిషన్ ఒకానొక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటనలని పంచుకున్నాడు.

Advertisement
CJ Advs

సినిమాల్లో హిట్లు లేక అవస్థలు పడుతున్న టైమ్ లో తన క్లోజ్ ఫ్రెండ్సే మోసం చేశారట. నిర్మాతగా మారి నిను వీడని నేనే సినిమాతో ఫర్వాలేదనిపించుకున్న తర్వాత కొంత స్థిమితపడ్డాడట. ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులవుతున్నా ఇంకా బ్యాచులర్ గా కొమసాగుతున్న సందీప్ కిషన్ ని రిలేషన్ షిప్ లో ఉన్నారా అన్న ప్రశ్నకి, గతంలో ఇద్దరితో రిలేషన్ షిప్ లో ఉన్నానని, ప్రస్తుతం దృష్టంతా సినిమా మీదే ఉందని బదులిచ్చాడు. 

లాక్డౌన్ టైమ్ లో ఏం చేస్తున్నారని అడిగితే, ఓటీటీలో వెబ్ సిరీస్ లు చూస్తూ కాలం గడుపుతున్నానని, ఈ మధ్య చూసిన సినిమాల్లో మళయాల చిత్రమైన ట్రాన్ బాగా నచ్చిందని పేర్కొన్నాడు. ఆ సినిమాలో హీరో ఫాహద్ ఫాజిల్ చాలా బాగా చేశాడని, నటనలో ఆయనే స్ఫూర్తిగా నిలుస్తున్నాడని తెలిపాడు.

He is my inspiraation.. Said Sandeep Kishan:

FahadFazil is My Inspiration said Sandeep Kishan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs