Advertisement
Google Ads BL

సినీ ఇండస్ట్రీని జూన్ వరకు ఆగమంటున్న తలసాని


ఇండస్ట్రీకి మేలు జరిగే విధంగా ఓ పాలసీ తీసుకొచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధంగా వుంది - సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Advertisement
CJ Advs

కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సి.కళ్యాణ్, నిర్మాతలు దిల్ రాజు, తుమ్మల ప్రసన్న కుమార్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ....

ప్రధానంగా ఈరోజు కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ టైంలో ఫిలిం ఇండస్ట్రీ కూడా ఎంతో ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వము సీఎం గారు కరోనాపై ఎంతో సీరియస్ గా వున్న విషయం తెలిసిందే. షూటింగ్‌లకు ఇబ్బందులు అవుతున్న సమయంలో క్రైసిస్ ఛారిటీ 14000 మందికి సహాయం చేశారు. చిరంజీవి, నాగార్జునగారు ఆధ్వర్యంలో ఓ పాలసీ తీసుకొచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధంగా వుంది. తెలంగాణా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలుగా సహాకారం అందిస్తుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత ఇండస్ట్రీ ప్రతినిధులతో మరోసారి చర్చలు జరిపి యధా విధి స్థానం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీ అనేది హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఇండస్ట్రీ. చలన చిత్ర పరిశ్రమకు కులాలు, ప్రాంతాలు వుండవు. ఏ విధంగా ఇండస్ట్రీని ప్రమోట్ చేసుకోవాలి అనేది చిరంజీవి, నాగార్జున ఆధ్వర్యంలో చర్చలు జరిపాం. ఇప్పటికిప్పుడు తొందరపడి ఇబ్బందులు తెచ్చుకోవటం కంటే జూన్‌లో అన్ని పరిస్థితులను క్షుణ్ణంగా ఆలోచించి షూటింగ్స్ చేసుకొనేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంటాము. జి.హెచ్.ఎమ్.సి నుంచి అన్నపూర్ణ భోజనం ఒక లక్ష మందికి ప్రతి రోజు పెడుతున్నాం. వలస కూలీలకు దాదాపు రెండు లక్షల మందికి 12కేజీల బియ్యం అయిదు వందల రూపాయలు ఇచ్చాము. ఇండస్ట్రీ విషయంలో లాక్ డౌన్ అయిన తరువాత ఏది బెస్ట్ అనేది అందరూ కూర్చొని మంచి నిర్ణయం తీసుకుందామని తెలిపారు.

 

సి.కళ్యాణ్ మాట్లాడుతూ...

చిరంజీవిగారు కరోనా క్రైసిస్ ఛారిటీ కి లీడ్ తీసుకొని చెయ్యడం చాలా గొప్ప విషయం, 14000 మంది సినీ వర్కర్స్ కి నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ వైజాగ్, విజయవాడ, తిరుపతిలో కూడా వున్న సినీ వర్కర్స్ కి ఇచ్చాము. ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ సీసీసీ సహాయం చేసింది లాక్ డౌన్ తరువాత చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. నిర్మాత చదలవాడ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ కౌన్సెల్ లో ఉన్న మెంబెర్స్ అందరికి, ఛాంబర్ లో ఉన్న సభ్యులకు, కొంతమంది నిర్మాతలకు కరోనా కారణంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి 10,000 ఆర్థిక సహాయం చేశారు, అలాగే ఛాంబర్, ప్రొడక్షన్ బాయ్స్ కు, మహిళ ఆర్టిస్టులకు, పేద ఆర్టిస్టులకు కూడా సహాయం చెయ్యడం జరిగింది. కార్డ్ లేని ఆర్టిస్ట్‌లకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత చదలవాడ శ్రీనివాస్‌గారికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

Talasani Srinivas Yadav Suggestions to Tollywood:

Wait until june.. Talasani suggests to tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs