Advertisement
Google Ads BL

అనసూయపై ఆగ్రహానికి గురైన నెటిజన్లు..


తప్పుడు వార్తలని నమ్మవద్దని, అలాంటి రాతలు రాసే వాళ్ల వెబ్ సైట్లని బ్యాన్ చేయాలంటూ విజయ్ దేవరకొండ ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ ౧౯ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి చేయూతగా నిలబడడానికి విజయ్ స్టార్ట్ చేసిన మిడిల్ క్లాస్ ఫండ్ గురించి అసత్య వార్తలు రాసారన్న ఉద్దేశ్యంతో, వారిపై యుద్దమే మొదలుపెట్టాడు విజయ్. విజయ్ చేస్తున్న ఈ పనికి ఇండస్ట్రీ నుండి మద్దతు కూడా లభించింది.

Advertisement
CJ Advs

సూపర్ స్టార్ మహేష్ బాబు మొదలుకుని, మెగాస్టార్ చిరంజీవి, ఇంకా దర్శకనిర్మాతలు స్పందించి, విజయ్ కి అండగా నిలుస్తామని చెబుతున్నారు. అయితే ఈ విషయమై అనసూయ సెటైరికల్ గా ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. విజయ్ ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ఎద్దేవా చేస్తున్నట్లుగా, మనదాకా వస్తేగానీ బుద్ది రాలేదన్న మాట అని ట్వీట్ చేయడంతో విజయ్ ఫ్యాన్స్ కోప్పడుతున్నారు.

అయితే అనసూయ అలా ట్వీట్ చేసిన మాట నిజమే కానీ ఎవరినీ ట్యాగ్ చేయలేదు. తెలివిగానే ఇలా ప్రవర్తించిందంటూ సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు తలెత్తుతున్నాయి. జోకులు వేయడానికి ఇది జబర్దస్త్ కాదంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా బాధపడుతున్న ఒక్కరికైనా హెల్ప్ చేశావా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో ఇలాంటి టైమ్ లో అందరూ కలిసికట్టుగా ఉండడం మంచిదని.. ఇలా ఒకరినొకరు విమర్శించుకుంటే పనులు అవ్వవని సలహా ఇస్తున్నారు.

Netizens fire on Anchor Anasuya.. :

Netizens Fires on Anchor Anasuya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs